'షో టైమ్' రివ్యూ..సస్పెన్స్‌తో చచ్చిపోతే ఎవరండి బాధ్యులు

అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మించిన, మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించిన తాజా చిత్రం షో టైమ్. నవీన్ చంద్ర హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన ఈ థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాపై ఉన్న నమ్మకంతో గత రెండు రోజులుగా ప్రీమియర్‌లను ప్రదర్శించారు. మరి ఈ 'షో టైమ్'తో నవీన్ చంద్ర ప్రేక్షకులను భయపెట్టాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ
'షో టైమ్' కథ చాలా సింపుల్. ఒక రాత్రి 11 గంటల సమయంలో ఒక ఇంట్లో కుటుంబం మొత్తం సరదాగా కబుర్లు చెప్పుకుంటుండగా, అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారని సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) వారికి వార్నింగ్ ఇస్తాడు. అక్కడే సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి భాస్కర్ల), సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ లక్ష్మీకాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడే సమయంలో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసు నుండి వారు ఎలా బయటపడ్డారు, వారికి లాయర్ వరదరాజులు (వి.కె. నరేష్) ఎలా సహాయం చేశాడు అనేది తెరపైనే చూడాలి.

Naveen Chandra show time movie review

విశ్లేషణ
ఈ కథ మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. దర్శకుడు మదన్ సింపుల్ కథను చక్కగా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ కేవలం 45 నిమిషాల నిడివితో ముగించి, అసలు కథను సెకండ్ హాఫ్‌లో ప్రారంభించాడు. నరేష్ కథలోకి ఎంటర్ అయినప్పటి నుండి హిలేరియస్‌గా నవ్వించాడు. అదే సమయంలో సస్పెన్స్‌ను కూడా బాగా హ్యాండిల్ చేశాడు. ఇలాంటి సినిమాలు మలయాళంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి నేపథ్యంలోనే ఒకే రూమ్‌లో సినిమాను ఆసాంతం నడిపించి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు మదన్ సక్సెస్ అయ్యాడు. సస్పెన్స్‌లో కామెడీని మిక్స్ చేయడంలో, డైలాగ్స్‌లో పదును ఉంటే వర్కౌట్ అవుతుంది. ఈ విషయంలో టీమ్ సక్సెస్ అయింది. గవిరెడ్డి శ్రీనివాస్ డైలాగ్స్ బాగా పండాయి. రాజా రవీంద్ర, నరేష్ మధ్య జరిగే ఎపిసోడ్ సినిమాకే హైలెట్. క్లైమాక్స్ ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది.

నటీనటులు
నవీన్ చంద్రకి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ఆ అనుభవంతోనే సులువుగా చేసేశాడు. వి.కె. నరేష్ తనదైన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రతో సినిమాను నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కామాక్షి భాస్కర్ల ఉన్నంతలో మెప్పించింది. ఇక జెమిని సురేష్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నవ్వించాడు.

సాంకేతిక అంశాలు
శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్
హిలేరియస్‌గా నవ్విస్తూ, భయపెట్టే షో టైమ్ ఆకట్టుకునే విధంగా ఉంది.

రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+