అత్త చనిపోతే ఫుల్ జోష్ లో ఇంట్లో సెలబ్రేషన్స్.. ఆ హీరోయిన్ ఎంతకు తెగించిందంటే..!!

సినిమా ఇండస్ట్రీ అనేది తెరిచిన పుస్తకం. సినీ తారల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. వారి నుంచి చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. అటు సెలబ్రిటీస్ కూడా తమ పోస్టులు, ఫోటోలు, వీడియోలను చూడాలని లైక్ కామెంట్ షేర్ చేయాలని అనుకుంటారు. అందుకే తమ లైఫ్ లో ఏ చిన్న మూమెంట్ జరిగినా అది ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా మలయాళం చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ నవ్య నాయర్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతోపాటుగా విమర్శలకు దారి తీసింది.

మలయాళం హీరోయిన్ నవ్య నాయర్ ఎప్పుడూ తన ఇన్ స్టా ఖాతాలో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది. అటు మూవీస్ అయినా ఇటు వెబ్ సిరీస్ అయినా ఇలా తన నుంచి ఏ అప్డేట్ ఉన్నా దాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో పంచుకోవడంలో ఆమె ముందుంటుంది. అయితే ఇటీవల ఆమె విషు పండగ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే నవ్య నాయర్ అత్త శాంత మెనాన్ అంతకు ముందే అంటే మార్చి 30న చనిపోయింది. ఈ సమయంలో ఆమె తన ఇంట్లో విషు పండగను ఘనంగా జరుపుకోవడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.

తన అత్త శాంత మెనాన్ మృతి చెందినప్పుడు కూడా నవ్య నాయర్.. ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. శాంత మెనాన్ కు నివాళులు అర్పిస్తూ ఆ వీడియో చేసింది. అయితే ఆమె మృతి చెందిన కొద్ది రోజులకే ఇంట్లో ఇలాంటి పండగను సెలబ్రేట్ చేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు నవ్య నాయర్ పై పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

NavyaNair Criticized by Netizens for Celebrating Vishu Soon After MotherinLaw Recently Passed Away

ఈ సెలబ్రేషన్స్ లో నవ్య నాయర్ తోపాటు ఆమె కుమారుడు కూడా ఉన్నాడు. తన అత్త చనిపోయి నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఆమె పండగ చేసుకుంటోందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో వ్యక్తి కామెంట్ పెడుతూ.. సిస్టర్ చనిపోయింది మీ భర్త అమ్మే కదా.. మీ సంప్రదాయాలు మాకు తెలియదు.. కానీ అప్పుడే ఇలాంటి సెలబ్రేషన్స్ అవసరమా..? అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+