ఇది మరో లెవెల్.. మహాశక్తి అవతారంలో లేడీ సూపర్ స్టార్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో 'లేడీ సూపర్ స్టార్'గా పేరొందిన నయనతార అభిమానులకు చిత్రబృందం ఓ గుడ్ న్యూస్ అందించింది. వినాయక చవితిని పురస్కరించుకుని ఆమె నటిస్తున్న కొత్త సినిమా 'మూకుతి అమ్మన్ 2' టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 'రైజ్ ఆఫ్ మహాశక్తి' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమా టీజర్, విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతూ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

2020na వచ్చి ఘన విజయం సాధించిన 'మూకుతి అమ్మన్'(తెలుగులో 'అమ్మోరు తల్లి') సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. ఈ సీక్వెల్ బాధ్యతలను తమిళంలో భారీ వాణిజ్య, ఫాంటసీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సి.సుందర్ చేపట్టారు. మొదటి భాగాన్ని మించి ఎంతో వైభవంగా, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ప్రతిష్టాత్మక ఫాంటసీ-డ్రామా రాబోయే దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Nayanthara as Mahashakti Mookuthi Amman 2 Teaser Promises a Grand Fantasy Action Spectacle

'మూకుతి అమ్మన్ 2' టీజర్ మొదటి సినిమా కంటే చాలా భారీగా, వైభవోపేతంగా కనిపిస్తోంది. ఈ కథ పౌరాణిక గతం, అల్లకల్లోలమైన వర్తమానం మధ్య ఊగిసలాడుతూ కనిపిస్తుంది. ప్రారంభ సన్నివేశాల్లో ప్రాచీన కాలంలో ఓ రాజ్యంపై భయంకరమైన దాడి జరిగినప్పుడు ఆ రాజ్యాన్ని కాపాడటానికి దైవిక శక్తి ఎలా ఆవిర్భివించిందో చూపించారు. ఆ వెంటనే కథ వర్తమానంలోకి వస్తుంది. ఓ రహస్యమైన, తీవ్రమైన విపత్తు సామాన్య ప్రజల జీవితాలను వినాశనం వైపు నెట్టివేస్తున్న వేళ, ప్రజలందరూ రక్షణ కోసం ప్రార్థిస్తుండగా.. నయనతార తేజోవంతమైన, ఉగ్రమైన మహాశక్తి అవతారంలో ఎంట్రీ ఇచ్చి మైమరిపిస్తుంది.

భారీ ఫాంటసీ యాక్షన్
మొదటి భాగమైన 'మూకుతి అమ్మన్' ఓ దైవిక భావనతో పాటు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై సాగే సామాజిక వ్యంగ్య చిత్రంగా నిలిచింది. అయితే ఈ సీక్వెల్ మాత్రం పూర్తిస్థాయి ఇతిహాస ఫాంటసీ-యాక్షన్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. మంచికి, చెడుకి మధ్య జరిగే సుదీర్ఘమైన పోరాటాన్ని సుందర్ సి తనదైన విజువల్ వండర్‌గా వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు ఈ టీజర్ స్పష్టం చేస్తోంది.

భారీ తారాగణం
ఈ సినిమాలో నయనతారతో పాటు దునియా విజయ్, రెజీనా కసాండ్రా, ఊర్వశి, యోగి బాబు, మైనా నందిని, గరుడ రామ్, అభినయ్, సునీల్ వర్మ వంటి భారీ తారాగణం నటిస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె.గణేష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమిజా పవర్‌ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించగా.. గోపీ అమర్‌నాథ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. దీపాళి పండుగ సీజన్లో అతిపెద్ద తమిళ బ్లాక్‌బస్టర్ గా నిలిచేందుకు ఈ దేవత సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+