అతను నమ్మించి మోసం చేశాడు - నయనతార
హీరో ధనుష్, హీరోయిన్ నయనతారల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ నవంబర్ 18న నెట్‌ఫిక్స్‌లో విడుదలైంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార సినీ కెరీర్‌లో ఎదురైన అనుభవాలు మొత్తం చూపించారు. ఇక్కడ వరకు బాగనే ఉన్నప్పటికీ, ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన 'నానుమ్ రౌడీ దాన్' పాటలను వినియెగించారు. దీనిపై హీరో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
'నానుమ్ రౌడీ దాన్' సినిమాను హీరో ధనుష్ నిర్మించారు. తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' పాటలను వినియోగించడంపై ఆయన కోర్టులో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార హీరో ధనుష్‌కు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.తండ్రి, దర్శకుడైన సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడంటూ ధనుష్‌పై నయనతార ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది.

నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ధనుష్‌కు రాసిన లేఖలో నయనతార పలు అంశాలను ప్రస్తావించారు. తాజాగా ఆమె మరోసారి ధనుష్‌తో వివాదంపై స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార ధనుష్‌తో ఉన్న విభేదాలపై స్పందించారు. ధనుష్ నా స్నేహితుడే అని అనుకున్నానని, కానీ నన్ను అతను శత్రువులా చూసాడని నయనతార తెలిపింది. సీన్లు వాడుకోవడానికి ఎన్ వో సీ అడిగాము. కానీ, అతను స్పందించలేదు. అందుకే ధనుష్‌ను కలవాలి అనుకున్నాం.దానికి కూడా ధనుష్ ఆసక్తిగాలేరు.
ఈ సినిమాలోని సీన్లు వాడుకోవడానికి అస్సలు కుదరదన్నారు. కనీసం ఓ నాలుగు లైన్లు వాడుకుంటామన్న దానికి కూడా అంగీకరించలేదు. బిహైండ్ ది సీన్స్ వాడినందుకు కూడా ధనుష్ ఒప్పుకోలేదు. ధనుష్ అర్థం చేసుకుంటాడని అనుకున్నాం కానీ వాటిపై కూడా ధనుష్ పరువు నష్టం దావా వేశారు. బిహైండ్ ది సీన్స్ అవి మా పర్సనల్. మా జీవితంలో ఆ సీన్స్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకే వాడుకున్నామని నయనతార తెలిపారు.












Click it and Unblock the Notifications