బాలయ్య.. ఈ రికార్డులను బద్దలు కొట్టడం ఎవరివల్లా కాదు!
నందమూరి నటసింహం సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఆగస్టు 30వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఘనంగా సత్కరించబోతోంది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులంతా హాజరవబోతున్నారు. తాతమ్మకల చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించి ఈరోజు వరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూ అరుదైన రికార్డును బాలయ్య నెలకొల్పారు. సినీ, రాజకీయ రంగాల్లో కూడా ఆయన పలు రికార్డులను సృష్టించారు. సినీరంగంలోని కొన్ని రికార్డులైతే ఆయనకే సొంతం. భవిష్యత్తులో కూడా ఎవరూ టచ్ చేయలేని రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.
బాలయ్య నటించిన 108 సినిమాల్లో 71 సినిమాలు శతదినోత్సవాన్ని జరుపుకున్నాయి.
బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమా ఏకంగా 1000 రోజులు ప్రదర్శింపబడి రికార్డు నెలకొల్పింది. దక్షిణాదిలో మరే హీరో ఈ రికార్డును అందుకోలేకపోయారు.
పౌరాణికం, సైన్స్ ఫిక్షన్, జానపదం, సాంఘికం.. ఇలా అన్ని జానర్లలో నటించిన ఏకైక హీరో బాలయ్య.
1987లో ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదల చేసి ఎనిమిదింటినీ సూపర్ హిట్ కొట్టిన ఏకైక హీరోగా నిలిచారు

1986లో విడుదలైన అన్ని సినిమాలు శతదితనోత్సవాలను జరుపుకున్నాయి.
ఒకేరోజు నిప్పురవ్వ, బంగారుబుల్లోడు సినిమాలను విడుదల చేయగా.. రెండూ శతదినోత్సవాలను జరుపుకున్నాయి.
ఆదిత్య 369 సినిమాతో టైమ్ ట్రావెల్ ను భారతీయ సినీ రంగానికి పరిచయం చేశారు.
సమరసింహారెడ్డి సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దానితర్వాత అనేక ఫ్యాక్షన్ సినిమాలకు అది కేంద్ర బిందువైంది.
హీరోగా, ఎమ్మెల్యేగా, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకుండా చేసిన సినిమా నారీనారీ నడుమ మురారి. ఇది పెద్ద సంచలనాన్ని సృష్టించింది.
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇటీవలికాలంలో హ్యాట్రిక్ సాధించిన ఏకైక హీరో బాలయ్య.
థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల్లో బాలయ్య సినిమాలే రెండు ఉన్నాయి.












Click it and Unblock the Notifications