ఈ సినిమాకు ఏకంగా రూ.19 వేల కోట్ల కలెక్షన్స్.. 2025 లో వరల్డ్ బిగ్గెస్ట్ హిట్..
సాధారణంగా ఓ సినిమాకు వంద కోట్లు వస్తే హిట్ అని 500 కోట్లు వరకు వస్తే బ్లాక్ బస్టర్ 1000 కోట్లు సాధిస్తే ఇండస్ట్రీ హిట్ అని లెక్కలేసుకుంటాం. అయితే ఓ సినిమా ఏకంగా రూ. 19 వేల కలెక్షన్స్ రాబట్టి వరల్డ్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2025 లో ఇదే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. అవతార్, అవెంజర్స్ మూవీల రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఈ మూవీ బడ్జెట్ రూ.710 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.19 వేల కోట్లకు పైగా వసూళ్ల సునామీ సృష్టించింది.
మన దగ్గర సినిమాలకు రూ. 1000 కోట్లు వస్తే బ్లాక్ బస్టర్ హిట్ అని తేల్చేస్తాం. అయితే ఓ చైనా మూవీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాక్సాఫీస్ లెక్కల్ని చెరిపేసింది. ఏకంగా రూ.19 వేల కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. 2025 లో ప్రపంచంలోనే అతిపెద్ద హిట్ గా అవతరించింది. ఆ చిత్రమే 'నే ఝా 2'.. ఈ చైనా యానిమేషన్ ఫిల్మ్ కు ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషం అని ట్రేడ్ నిపుణులు చెప్పుకుంటున్నారు.
2019 లో హిట్ అయిన 'నే ఝా' సినిమాకి సీక్వెల్ గా 'నే ఝా 2' ను రూపొందించారు మేకర్స్. ఈ సినిమాను పూర్తిగా చైనా పురాణాల ఆధారంగా తెరకెక్కించారు. విధిని ఎదిరించి నిలిచిన ఓ బాలుడి కథతో ఫాంటసీ అడ్వెంచర్ గా రూపొందించారు. ఈ మూవీ మాండరిన్ భాషలో తెరకెక్కింది. 2025 జనవరి ఆఖరిలో విదేశాల్లో విడుదలైన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ తో భారత్ లోనూ గతేడాది ఏప్రిల్ మాసంలో రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పటివరకూ 'అవతార్', 'అవెంజర్స్: ఎండ్ గేమ్', 'అవతార్ 2', 'టైటానిక్' వంటి దిగ్గజ చిత్రాలే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. చైనా నుంచి చిత్రాలు లేవు. అయితే తాజాగా 'నే ఝా 2' చిత్రం ఆ రికార్డుల్ని తిరగరాసింది. 2025 లో ప్రపంచంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.
-
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications