ప్రభాస్ ను టార్గెట్ చేశారు... వెనక ఏం జరుగుతోంది??
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ సలార్. సెప్టెంబరు 28నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదేరోజు షారుక్ ఖాన్ నటించి డుంకీ చిత్రం కూడా విడుదల కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరూ హోరాహోరీగా తలపడబోతున్నారు.
టార్గెట్ ప్రభాస్: ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత రాబోతున్న సినిమా కావడం, ప్రభాస్ పూర్తిస్థాయిలో చేసిన యాక్షన్ మూవీ కావడంతో రోజురోజుకు అంచనాలు పెరుగుతానే ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సందర్భంలోనే సలార్ పై నెగెటివ్ ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో ప్రభాస్ ను, సలార్ ను టార్గెట్ గా చేసుకొని రకరకాల కథనాలు వస్తున్నాయి.

సత్తా ఉంటే ఎందుకు వాయిదా వేశారు?: సినిమాలో సత్తా ఉంటే ఎందుకు వాయిదా వేసుకోవాలని.. సెప్టెంబరు 28నే విడుదల చేయొచ్చుగా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. టైర్ 2 హీరోలు కూడా తమ సినిమాలను సలార్ కంటే రెండు రోజుల ముందే విడుదల చేస్తున్నారని, దాన్నిబట్టి ప్రభాస్ సినిమా అంటే ఎవరికీ భయం లేదనే సంగతి అర్థమవుతోందని, ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలంటూ డార్లింగ్ కు ఉన్న క్రేజ్ ని, హైప్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రైలర్ సమాధానం చెబుతుంది: అయితే వీటిని డార్లింగ్ అభిమానులు తేలిగ్గా తీసుకోవడంలేదు. ఈ సినిమా సంచలన విజయం సాధించి విమర్శకుల నోర్లు మూయిస్తుందంటున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ట్రైలర్ సమాధానం చెబుతుందంటున్నారు. బజ్‌ను మెయింటైన్ చేయడానికి, ప్రతికూల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు సినిమా గురించి కొన్ని పోస్టర్లు లేదా అప్‌డేట్‌లను విడుదల చేయాలని వారు దర్శక నిర్మాతలను అభ్యర్థిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ మైలురాయిలా నిలవబోతోందనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications