ప్రభాస్ 'ఫౌజీ'కి ఊహించని షాక్: నేతాజీ మనవడి తీవ్ర అభ్యంతరం!
పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఫౌజీ' సినిమా నుంచి విడుదల చేసిన బర్త్‌డే గ్లింప్స్(ప్రత్యేక వీడియో) వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను చిత్రీకరించిన విధానంపై ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో చిత్ర నిర్మాతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నేతాజీ మనవడు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో గ్లింప్స్‌లో నేతాజీ అడాల్ఫ్ హిట్లర్‌తో ఉన్న ఓ సన్నివేశాన్ని చూపించారు. ఈ సన్నివేశం ద్వారా ప్రభాస్ పోషిస్తున్న ఓ భారతీయ గూఢచారి(స్పై) కాల్పనిక పాత్రతో నేతాజీ స్టోరీని అనుసంధానించారు. ఓ స్వాతంత్య్ర సమరయోధుడిని ఈ రకంగా సినిమా కథానాయకుడి పాత్రతో ముడిపెట్టడంపై కొంత మంది వీక్షకులతో పాటు నేతాజీ కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా చారిత్రక నేపథ్యంపై స్పందించిన చంద్రకుమార్ బోస్.. భారత స్వాతంత్ర్య పోరాటంలో సాయం కోసం నేతాజీ జర్మనీని సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ.. దాన్ని ఫాసిజానికి మద్దతుగా భావించకూడదని స్పష్టం చేశారు. ఈ రకమైన చిత్రీకరణను నిరసిస్తూ డైరెక్టర్ హను రాఘవపూడి, చిత్ర బృందం క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.
సినిమా విడుదల కాకముందే ఈ వివాదం 'ఫౌజీ'చిత్రంపై అందరి దృష్టి పడేలా చేసింది. ఇది ఓ కాల్పనిక స్టోరీ అయినప్పటికీ.. వాస్తవ స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రను చిత్రంలో ఉపయోగించడం, చరిత్రను చూపించిన తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా ఈ డిమాండ్‌పై చిత్ర నిర్మాతలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 మార్చి 19న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
Kolkata, West Bengal: Chandra Bose, Grandnephew of Subhash Chandra Bose says, ''Teaser has been doing the rounds in social media of Prabhas's Fauji. See, anyone can produce and make a film on freedom struggle, freedom movement. They can portray revolutionaries and freedom fighters. But it is very important to ensure that the right historical perspective is put forward for the viewers. Distortion of facts and treading on fiction, dealing with national icons, freedom fighters, and personalities, I think is a crime..''
— IANS (@ians_india) October 25, 2026














Click it and Unblock the Notifications
