ప్రభాస్‌పై రూ.9వేల కోట్ల పెట్టుబడి పెట్టిన ‘నెట్‌ఫ్లిక్స్’
Netflix: సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ ఒక సినిమాను కొనుగోలు చేయాలంటే వెయ్యిసార్లు ఆలోచిస్తుంది.. రెండువేల సార్లు వడపోతలు పోస్తుంది. కేవలం ప్రాంతీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న సినిమాలకే ఈ ఓటీటీ దిగ్గజం పెద్దపీట వేస్తుంటుంది. ఎందుకంటే సబ్ టైటిల్స్ తో ఇతర భాషల్లోకి కూడా వెళుతుంది కాబట్టి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలనేది నెట్ ఫ్లిక్స్ ప్లాన్. ఈసారి పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కోసం తన నిబంధనలను సడలించింది. ప్రభాస్ సినిమాలపై వందల కోట్ల వ్యయాన్ని వెచ్చిస్తోంది.
ప్రభాస్ భవిష్యత్ ప్రాజెక్టులైన 'కల్కి 2', 'స్పిరిట్', 'ఫౌజీ' సినిమాల డిజిటల్ భాగస్వామిగా అవతరించింది. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన 'కల్కి' సీక్వెల్‌తో పాటు, సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' వేర్వేరు నిర్మాతలు నిర్మిస్తున్నా, ఒక్కో నిర్మాతతో విడివిడిగా చర్చలు జరిపి ప్రభాస్ సినిమాలను తన వశం చేసుకుంది. 'బాహుబలి' తర్వాత ఉత్తరాది నుంచి ఓవర్సీస్ వరకు డార్లింగ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది.

ప్రభాస్ సినిమా స్ట్రీమింగ్ అవుతుందంటే చాలు
ఐదు భాషల ప్రేక్షకులు ఒకేసారి యాప్‌లోకి వస్తుండటంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ దగ్గర ఉన్న వ్యూయర్ షిప్ డేటా ప్రకారం, భారీ యాక్షన్ ఎంటర్టైనర్లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అందుకే సందీప్ వంగా వంటి మాస్ దర్శకులతో ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులకు రికార్డ్ బ్రేకింగ్ ధరలు ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ వెనకాడలేదు.
నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు ఒక ఎత్తైతే
ఈ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు కూడా రెబల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో 2 దేశాల మధ్య యుద్ధం, చారిత్రక కథాంశంతో వస్తున్న 'ఫౌజీ' 2026 ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక సందీప్ వంగా మార్కు యాక్షన్ మూవీ 'స్పిరిట్' మార్చి 5, 2027న విడుదల కానుంది. మరోవైపు సైన్స్ ఫిక్షన్ వండర్ 'కల్కి 2' షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది. మొత్తం మీద బాక్సాఫీస్ వద్దే కాదు, డిజిటల్ స్క్రీన్‌ల పైనా ప్రభాస్ మేనియా ఓ రేంజ్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications