Kasthuri Shankar : నటికి అసభ్యకరమైన మెసేజ్ పెట్టిన నెటిజన్.. గంటకు 5 వేలంటూ కామెంట్
సోషల్ మీడియా వచ్చిన తరువాత తారతమ్యాలు లేకుండా పోయాయి. ఎక్కడ నుంచైనా ఎవరితోనైనా నేరుగా మాట్లాడే సౌలభ్యం అందరికి దక్కింది. ముఖ్యంగా సెలబ్రిటీలతో డైరెక్టుగానే కనెక్ట్ అయ్యే అవకాశం అభిమానులకు దక్కుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో, హీరోయిన్లతో మాట్లాడే వారు కొందరైతే.. మరి కొందరు సోషల్ మీడియాను మిస్ యూజ్ చేస్తున్నారు.
ఇలాంటి వారి వల్ల హీరోయిన్లు, సీనియర్ యాక్టర్స్ ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సీరియల్ యాక్టర్ అయిన కస్తూరి శంకర్‌కు ఎదురైంది.అన్నమయ్య సినిమాతో కస్తూరి శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్.. తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటిస్తూ బీజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది.

తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన కస్తూరి శంకర్ .. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సమయంలోనే ఓ నెటిజన్ తమిళంలో బిగ్‌బాస్ మొదలవుతుంది కదా..అందులోకి మీరు ఎంట్రీ ఇస్తున్నారా అని ప్రశ్నించగా..అలాంటిది ఏమి లేదని..అసలు నేను బిగ్‌బాస్‌ను ఫాలో అవ్వనని సమాధానం చెప్పింది. బిగ్‌బాస్ చూసే టైమ్ కూడా లేదని.. ప్రస్తుతం షో మొదలైందని..దాని గురించి నేను ఇలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.
అయితే ఈ సమయంలోనే మరో నెటిజన్ కలుగజేసుకుని.. నువ్వు బిగ్‌బాస్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముందిలే..నీకు గంటకు 5000 వస్తాయి కదా అంటూ మరో అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. తన గురించి అసభ్యకరంగా మాట్లాడిన నెటిజన్‌కు కస్తూరి శంకర్ దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలాగే పెంచారా.నిన్ను చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.దీనికి సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications