రవితేజ కూతురు ఎంత బాగుందో.. హీరోయిన్ ను మించిన అందం బాబోయ్..
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమానే లైఫ్ గా భావించి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిన్న చితకా పాత్రలతో నెట్టుకొచ్చి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మాస్ మహారాజ రవితేజ హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాస్ జాతర అనే సినిమా చేశాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సినిమాలు కూడా కమిట్ అవుతున్నారు రవితేజ. తాజాగా రవితేజ కూతురు మోక్షద ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రవితేజ కూతురు మోక్షద హీరోయిన్లను మించిన అందంతో ఉందని చాలామంది నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయితే మాత్రం ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరు పక్కకు తప్పుకోవాల్సిందేనని అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం. అయితే మోక్షదను హీరోయిన్ గా తీసుకొచ్చే ఉద్దేశం రవితేజకు లేనట్లు తెలుస్తోంది. అయితే కుమారుడ్ని మాత్రం హీరో చేస్తానని పలు మార్లు చెప్పారు. ఇక రవితేజ కుమారుడు ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు.
అటు సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ మాస్ మహారాజ రవితేజ దూసుకెళ్తున్నారు. ఇటీవల వనస్థలిపురంలో ART సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో నిర్మించిన ఈ థియేటర్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోనే తొలి ఎపిక్ స్క్రీన్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications