నీ సినిమా చూడటం కంటే..ఆ పని చేయడం బెటర్ అన్న నెటిజన్ ..అదిరిపోయే రిప్లై ఇచ్చిన హీరో
వెండితెరపై చాలామంది హీరోలు ఉంటారు. కానీ బుల్లితెరపై ఆ రేంజ్‌లో అభిమానులను ఆకట్టుకోవడం అంటే కాస్తా కష్టమే. బుల్లితెరపై కూడా అభిమానులను సంపాదించుకున్న వారు కూడా ఒకరిద్దరు ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్. వీరిద్దరికి బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. వీరు కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. బుల్లితెరపై వచ్చిన ఫాలోయింగ్‌తో వీరు వెండితెరపై హీరోలుగా నటిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Em parledu bhayya okasari try chey ..saradaga navvukuni vachey…chusaka cheppu bhayya biryani kuda nene pamipstha ❤️🤗#AkkadaAmmayiIkkadaAbbayi https://t.co/RYwREZjfWr
— Pradeep Machiraju (@impradeepmachi) April 13, 2025
దీనిలో భాగంగానే ప్రదీప్ హీరోగా , దీపిక పిల్లి హీరోయిన్‌గా నటించిన చిత్రం "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి". టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ప్రదీప్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాట రిలీజ్ , రామ్ చరణ్‌తో మొదటి టికెట్ కొనుగొలు చేయించడం వంటి కార్యక్రమాలతో సినిమా ప్రమోషన్స్‌ను కూడా అదరగొట్టారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రదీప్ కోసం సినిమా చూద్దామని అనుకున్నా, కానీ, రివ్యూస్ చూసిన తర్వాత ఆ సినిమాకు వెళ్లి డబ్బులు ఆగం చేసుకోవడం కంటే, బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినడం మేలని గ్రహించా అంటూ సదరు నెటిజన్ ప్రదీప్ సినిమాపై కామెంట్ చేశాడు. ఇక ఆ నెటిజన్ ట్వీట్‌కు ప్రదీప్ మాచిరాజు స్వీట్ రిప్లై ఇచ్చాడు. 'ఏం పర్లేదు భయ్యా ఒకసారి ట్రై చెయ్.. సరదాగా నవ్వుకొని వచ్చేయ్.. చూశాక చెప్పు భయ్యా బిర్యాని కూడా నేనే పంపిస్తా' అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications