గోవా ఎందుకు పారిపోయావు జానీ..?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ టాలీవుడ్ ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది.
జానీ మాస్టర్ భార్య అయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు.

అదేవిధంగా జానీ మాస్టర్‌ను విచారించేందుకు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ను వేయిబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ వివాదంపై ఆయన భార్య వాదన మరోలా ఉంది.తన భర్త జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆమె అంటున్నారు.నేషనల్ అవార్డు సాధించిన నా భర్తను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని.. ఇందులో కుట్ర దాగి ఉందని అన్నారు. అందరూ కలిసి జానీ మాస్టర్ పై కుట్ర పన్నారని.. ఇందులో భాగంగానే మహిళా కొరియోగ్రాఫర్ తో పోలీసులకు ఫిర్యాదు చేయించారని చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ భార్య అయేషా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీ భర్త ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు గోవా పారిపోయారో చెప్పాలని జానీ మాస్టర్ భార్యను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేయని వారైతే నేరుగా ఎదుర్కొవాలి కానీ ఇలా పారిపోయి, నేను తప్పు చేయలేదంటే ఎవరూ నమ్మరని జానీ మాస్టర్ భార్యకు నెటిజన్లు కౌంటరిస్తున్నారు.
-
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !!












Click it and Unblock the Notifications