కత్రినా కైఫ్ విడాకులు..మరో హీరోయిన్‌తో భర్త దొరికిపోవడంతో..?

ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రీ. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ మారిపోయింది. యానిమల్ సినిమాలో త్రిప్తి డిమ్రీ గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అందం, అభినయం, గ్లామర్‌తో కట్టిపడేసింది.యానిమల్ సినిమా కన్నా ముందే పలు సినిమాల్లో నటించినప్పటికి రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చిందనే చెప్పాలి.

ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. యానిమల్ సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో త్రిప్తికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అలాగే ఇటు తెలుగులో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు.

netizens trolls on tripti dimri and vicky kaushal

త్రిప్తి డిమ్రి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. కానీ బుల్ బుల్ చిత్రంతోనే ఫేమస్ అయ్యింది. ఇక యానిమల్ సినిమా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్కీ విద్య కా వో వాలా వీడియో, భుల్ భూలయా 3, బ్యాడ్ న్యూజ్, దఢక్ 2లో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. త్రిప్తి నటిస్తోన్న బ్యాడ్ న్యూజ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త వీక్కీ కౌశల్‌ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో వీక్కీ కౌశల్‌తో త్రిప్తి స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్ చేస్తున్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం త్రిప్తి షేర్ చేసిన ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

దీనిపై ఓ నెటిజన్లు కొందరు కత్రినా కోపంగా ఉన్న మీమ్స్ షేర్ చేస్తూ విడాకులు ఇస్తుంది, లేదా సల్మాన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది అని కామెంట్లు పెడుతున్నారు.త్రిప్తి ఇలాంటి ఫొటో మరొకటి పెడితే కత్రినా భర్తకు విడాకులు ఇచ్చి వెళ్లిపోవడం ఖాయమంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. త్రిప్తి పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+