తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వచ్చింది
తెలుగు సినీ పరిశ్రమలోకి రోజురోజుకు కొత్త హీరోయిన్లు ప్రవేశిస్తున్నారు. కొంతమంది కష్టపడి తమను తాము నిరూపించుకొని కొన్నాళ్లు హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత కూడా అదృష్టం కలిసివస్తే సీనియర్ హీరోల పక్కన కూడా నటిస్తున్నారు. మరికొందరికి అదృష్టం కలిసివచ్చి 10 నుంచి 15 సంవత్సరాలపాటు హీరోయిన్లుగా కొనసాగేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి హీరోయిన్ల లైఫ్ స్టైల్ చాలా తక్కువ. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను హీరోయిన్ల కొరత వేధిస్తోంది. స్టార్ హీరోలతోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకులు కూడా హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటున్నారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియలో ట్రెండ్ అవుతున్న పేరు ఆయేషా ఖాన్. తాజాగా విడుదలైన 'ఓం భీం బుష్'లో ఓ పాత్ర చేసింది. అంత ప్రాధాన్యం ఉన్న పాత్రేమీ కాదుకానీ వ్యాంప్ తరహాలో ఉంటుంది. అయితే హీరోయిన్ ప్రీతి ముకుందన్ కంటే ఆయేషా ఖాన్ మీదే ప్రేక్షకులు ఎక్కువ దృష్టిపెట్టారు. కారణం.. గ్లామర్ గా కనపడటమే. చేపల ఫ్రై అమ్మే అమ్మాయిగా ఆమె చేసిన క్లీవేజ్ షో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. దీంతో కుర్రకారు మొత్తం ఆయేషాక్ బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఆయేషా చేసిన 'మోత మోగిపోద్ది' పాటకు సంబంధించి ప్రోమో రిలీజైంది. ఆ పాటలో కూడా ఆయేషా చేసిన క్లీవేజ్ షో ఆసక్తి కలిగించింది. ఆయేషావల్లే ఈ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది. హాట్ హాట్ గా కనిపించే ఆయేషా టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తోందంటున్నారు. హిందీ 'బిగ్ బాస్' 17వ సీజన్లో కంటెస్టెంట్‌గా వెళ్లడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. సినిమా కెరీర్ టాలీవుడ్‌తోనే మొదలైంది. ముఖచిత్రం అనే సినిమాలో నటించి ఆయేషా దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం లక్కీ భాస్కర్ లో కూడా ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది.












Click it and Unblock the Notifications