రోజా షోలో 'హరి హర వీరమల్లు'కు ఊహించని పబ్లిసిటీ (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'హరిహర వీరమల్లు' జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మెగా ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ వ్యూహాత్మక ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది.
సినిమాకు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్ ఉంది. ట్రైలర్లు, టీజర్లు, మేకింగ్ వీడియోలు విడుదల చేసి యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ అయ్యేలా చూస్తున్నారు. #HaruHaraVeeramallu అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు, ఇతర నటీనటుల ప్రత్యేక ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇంటర్య్వూలు ఇస్తూనే టెలివిజన్ షోల్లో సైతం భాగమవుతున్నారు. నిధి అగర్వాల్ 'హరిహర వీరమల్లు'సినిమాను తెగ ప్రమోట్ చేస్తోంది. దీనిలో భాగంగానే రోజా న్యాయ నిర్ణేతగా వ్యవహారిస్తున్న డ్రామా జూనియర్స్ షోలో కూడా హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ జరిగాయి.
నిధి అగర్వాల్ 'హరి హర వీరమల్లు' ప్రమోషన్స్ కోసం షోకు హాజరవడం, అందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో విడుదల కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఈ ప్రోమోపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, రోజా షోలో నిధి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఈవెంట్‌లో రోజా కూడా భాగమే కాబట్టి, ఆమె కచ్చితంగా 'హరి హర వీరమల్లు' గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక మాట మాట్లాడాల్సి ఉంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు. రాజకీయ వైరం పక్కనపెట్టి, ఒక కళాకారిణిగా, సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఆమె ఏం మాట్లాడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, రోజా వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఆమె వ్యాఖ్యలు సినిమాపై, పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications