మాస్ హీరోయిన్ అవుతా.. కానీ ఆ పని మాత్రం చేయను అంటున్న బ్యూటీ !

నిధి అగర్వాల్.. 1993, ఆగస్టు 17న హైదరాబాద్లో స్థిరపడిన మార్వాడీ కుటుంబంలో జన్మించింది. తెలుగు ప్రేక్షకులకు 'సవ్యసాచి' సినిమా ద్వారా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తనదైన నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో చేసిన 'మిస్టర్ మజ్ను' ఫ్లాప్ అయినా.. రామ్ పోతినేనితో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ ఒక్క హిట్తోనే ఆమె టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించింది. తరువాత తక్కువ చిత్రాల్లో నటించినా.. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.

2022 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిధి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా అనివార్య కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోగా.. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూలై 24న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

nidhi-agarwal-interesting-comments-about-becoming-mass-heroin

నిధిని చూస్తే సిగ్గేసింది..

ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సినిమా పూర్తైన తర్వాత కూడా ఒక్కరోజు విరామం లేకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోందని పేర్కొన్నారు. వరుస ఇంటర్వ్యూలు చేస్తూ, సినిమాను తన భుజాలపై మోస్తోందని ప్రశంసించారు. "నిధిని చూస్తే నిజంగా సిగ్గేసింది. ఆమె కెరీర్‌ను పక్కన పెట్టి సినిమాకి ఇచ్చిన కృషి అభినందనీయం" అని చెప్పారు.

అవి మాత్రం చేయను..

అలానే ప్రమోషన్ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి కళలు నేర్చుకున్నానని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ కీలక సన్నివేశం ఉండబోతుందని.. తన పాత్రకు ఓ ఊహించని ట్విస్ట్ ఉంటుందని చెప్పింది. అయితే లిప్‌లాక్ సీన్లు, బికినీ వేషాలు తాను చేయనని.. పేరెంట్స్‌తో కూర్చుని చూడలేని సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చింది. బోల్డ్ సీన్లు చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వొచ్చు అంటూ వెల్లడించింది.

nidhi-agarwal-interesting-comments-about-becoming-mass-heroin

మరోవైపు నిధి అగర్వాల్ మరో భారీ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో కలిసి నటించిన 'ది రాజా సాబ్' కూడా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఒకే ఏడాదిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఏడాది తన ఫేట్ మారుతుందన్న ఆశతో ఎదురు చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+