'హరిహర'లో పవన్ పక్కనున్న పొడుగు వ్యక్తి.. ఆ హీరోయిన్ కొడుకని మీకు తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్లు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా జులై 24 గ్రాండ్ గా ఈ సినిమా విడుదలైంది. అయితే ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా జులై 23 బుధవారం రాత్రే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక ప్రీమియర్ షోల తోనే హరిహర వీరమల్లు దాదాపు రూ. 30 కోట్లు రాబట్టినట్లు స్వయంగా పవన్ కల్యాణ్ సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు. సినిమాకు తొలి రోజు దాదాపు రూ. 40 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మూవీకి నెగెటివ్ టాక్ ఉన్నా వీకెండ్ వరకూ బాగానే కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే తాజాగా మూవీ చూసినవాళ్లు పవన్ కల్యాణ్ పక్కన ఉన్న ఆ పొడుగు వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో పవన్ కల్యాణ్ ధర్మం కోసం ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడితే ఆయనకు సపోర్ట్ ఈ పొడుగు వ్యక్తి పోరాటం చేశాడు. ఆయన పాత్రకు డైలాగులు పెద్దగా లేకపోయినా.. పవన్ తో పాటు చాలా సేపు స్క్రీన్ పై కనిపించాడు. అయితే ఆ పాత్రలో నటించింది ఎవరో కాదు ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్. ఇటీవల సక్సెస్ మీట్ లో పవన్ కల్యాణ్ నిహార్ పాత్రను 'ఫ్రాంటియర్ గాంధీ' గా ప్రసిద్ధి చెందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నుండి ప్రేరణ పొందిందని పవన్ అన్నారు. ఈ సినిమాలో నిహార్ నటనకు పవన్ ప్రశంసలు కురిపించారు. అతని పనితనం, తన పాత్రను సక్సెస్ మీట్ లో ప్రస్తావించారు. అటు ప్రేక్షకులు కూడా నిహార్ పాత్ర.. అతని నటనకు మెచ్చుకుంటున్నారు.

అయితే.. నిహార్ కపూర్ 2022లో విడుదలైన 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' చిత్రంతో నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఇక హరిహర వీరమల్లు అతని కెరీర్ లో పెద్ద చిత్రంగా మిగిలిపోయింది. మరి ఈ సినిమా నిహార్ కెరీర్ లో ఏ మేర అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం హరిహర వీరమల్లు విడుదలైన రోజు, ఇండియాలో అన్ని భాషల్లో కలిపి, రూ. 31.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం ఓపెనింగ్ గ్రాస్ రూ.44.20 కోట్లకు చేరుకుంది.












Click it and Unblock the Notifications