గుడ్ న్యూస్ చెప్పిన నిహారిక..కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.

Niharika announcing new movie her under production

అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు స్పందించలేదు. ఓ యూట్యూబ్‌లో ఛానెల్‌లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది.

పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే నిహారిక పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిహారిక నిర్మాతగా మారబోతోంది. తాజాగా తన ప్రొడక్షన్‌లో తీయబోయే సినిమా టైటిల్‌ను ప్రకటించింది. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమీటీ కుర్రాళ్లు'' పేరుతో సినిమా వస్తుందని నిహారిక ప్రకటించింది. మరి ఆర్తి పల్లాలు, దండ్లు గట్టా దగ్గరెట్టుకొండమ్మా. మన కమిటీ కుర్రోళ్లు బయదెల్లిపోయేరు. ఇది చూసిన నెటిజన్లు నిహారికకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+