మహేష్‌బాబు నా మొగడని ఫిక్సయ్యా: నిహారిక
రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 29వ సినిమాగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. డాక్టర్ కె.ఎల్.నారాయణ దుర్గా ఆర్ట్స్ పతాకంపై రూ.1500 భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. రెండు సంవత్సరాల తర్వాత మొదటి భాగం విడుదలయ్యే అవకాశం ఉంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి దీన్ని తీర్చిదిద్దుతున్నాడు. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా దీన్ని తీయాలనే పట్టుదలతో ఉన్నాడు.
తొలిసారిగా మురారిలో చూశా
బుల్లితెరపై తిరుగులేని నటిగా చెలామణి అవుతున్న నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడు సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. పెరుసు సినిమాద్వారా వెండితెరకు పరిచయం అవుతోంది. తెలుగులో ఈ సినిమాను 'పెద్ద' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడింది. ప్రిన్స్ ను తొలిసారిగా మురారి సినిమాలో చూశానని చెప్పింది. ఆ సినిమా చూసిన తర్వాత తన మొగుడు అతనే అని ఫిక్స్ అయినట్లు వెల్లడించింది.

పాలు మనిషిలా మారితే ఇలాగే ఉంటాడు
ఇలాంటి అందగాణ్ని తన జీవితంలో ఇంతవరకు చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడనేమోనని వ్యాఖ్యానించింది. అంత అద్భుతంగా ప్రిన్స్ ఉంటాడని, తనకు ఐదు సంవత్సరాల వయసులోనే మహేష్ బాబును చూసినట్లు తెలిపింది. మురారి సినిమా చూసినప్పుడు కూడా తన ఫీలింగ్ ఏమిటనేది తనకు తెలియదని, కానీ ఇప్పటికీ మహేష్ బాబే తనకు మొగుడని తాను గట్టిగా ఫిక్స్ అయినట్లు చెప్పింది. పాలు మనిషిలా మారితే మహేష్ బాబులా ఉంటాడని, ఆయన మిల్క్ మ్యాన్ అని కొనియాడింది. మహేష్ బాబు ఇంతవరకు ఎవరితోను రీల్స్ చేయలేదని, తనతో మాత్రమే చేశాడని, అదికూడా రెండుసార్లు చేశాడంటూ చాలా గొప్పగా నిహారిక చెప్పింది. మహేష్ బాబు గురించి నిహారిక చెప్పిన మాటలతో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు నిహారిక పెద్ద బాంబ్ పేల్చిందని స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications