పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మెగాడాటర్ నిహారిక కౌంటర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
లక్షలాది అభిమానులు ఆయన్ను అభిమానిస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కల్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే పవన్ కల్యాణ్ విజయం సాధించిన దగ్గర నుంచి ఆయన అభిమానులు హడావిడి కాస్తా ఎక్కువైందనే చెప్పాలి. పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్స్ మీద రాసుకుంటున్నారు.

ఇది పవన్ దృష్టికి వెళ్లడంతో అభిమానులను అలా చేయవద్దని వారించారు. ఇలా చేయడం వల్ల తనకు చెడ్డపేరు వస్తోందని, ఆర్టీఓ అధికారులకు చాలా ఇబ్బంది అని.. ఇలాంటి పనులు చేయవద్దని అభిమానులను పవన్ వారించారు. పలు సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు బైక్స్ మీద ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే స్టికర్‌ను తీసివేయడం జరిగింది. తాజాగా మెగా డాటర్ నిహారిక సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్ జరిగింది.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు నిహారిక కౌంటర్..!#NiharikaKonidela #PawanKalyan #APPolitics #CommitteeKurrollu #Oneindiatelugu pic.twitter.com/rwl4lEVE5g
— oneindiatelugu (@oneindiatelugu) August 25, 2024
ఈ ఈవెంట్‌లో పవన్ అభిమానులు హంగామా చేశారు. వేదిక మీద పలువురు సెలబ్రిటీలు మాట్లాడుతున్న సమయంతో గట్టిగా జై పవర్ స్టార్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న హైపర్ ఆది వాళ్లని ఎంత కంట్రోల్ చేయలని చూసిన ఫలితం లేకుండా పోయింది. అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న నిహారిక బాబు సీఎం నారా చంద్రబాబు నాయుడుగారు, పవన్ కల్యాణ్ కాదని చెప్పి షాకిచ్చారు. వెంటనే మా బాబాయ్ డిప్యూటి సీఎం అంటూ మరోసారి పవన్ అభిమానులకు ఆమె కౌంటరిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications