రామ్ చరణ్ పెద్ద చీటర్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ , అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ కొట్టిన రామ్ చరణ్ , ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారాడు. అయితే అలాంటి రామ్ చరణ్ మీద ఓ మహిళ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్ పెద్ద చీటర్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది ఆ నిర్మాత. రామ్ చరణ్‌ను ఇలా అన్నది మరెవ్వరో కాదు మెగా డాటర్ నిహారిక.
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చారు.

విడాకులు అనంతరం ఆమె తిరిగి షోస్, సినిమాలు చేస్తున్నారు. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఇదే సమయంలో నిహారిక నిర్మాతగా కూడా మారి ఓ సినిమాను నిర్మించారు. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిహారిక. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాశంతో డైరెక్టర్ యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో సాయి కుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ ప్రధాన పాత్రలను పోషించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.
ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో కమిటీ కుర్రోళ్లు మూవీని నిహారిక గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. తన అన్న మెగా పవర్ స్టార్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ..తాను ఇటీవలే కొత్త ఇంటికి మారానని, తనని కలవడానికి రామ్ చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అందరు వచ్చారని నిహారిక చెప్పుకొచ్చింది.
అందరం కలిసి డమ్ శరాస్ గేమ్ ఆడామని,రామ్ చరణ్ ఇలాంటి గేమ్ ఆడతాడని అభిమానులు ఎవరూ కూడా ఊహించలేరని కానీ చరణ్ అన్న ఈ ఆడతాడని నిహారిక తెలిపింది. చరణ్ అన్న పెద్ద చీటర్.గేమ్‌లో చాలా చీటింగ్ చేస్తాడు. గేమ్స్‌లో చీటింగ్ చేసి అందర్ని ఓడించి మోసం చేసి ఆయన మాత్రం గెలుస్తాడని నిహారిక చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ గురించి నిహారిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications