పూరీ - విజయ్ సేతుపతి మూవీలో ఛాన్స్ కొట్టేసిన నిహారిక..?
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు పూరీ. ఇక ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ నటి టబు నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' తర్వాత ఏ తెలుగు సినిమాను ఒప్పుకోని టబు.. ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
అలానే ఈ మూవీలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహ రెడ్డి సినిమాతో నటించారు విజయ్. ఇక వీరితో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక ఆఫ్టే కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూ ఎన్సర్ నటించనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇన్ స్టాగ్రామ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక NM గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ క్రియేటర్ గా ఆమె వీడియోస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గానే వైభవ్ హీరోగా నటించిన " పెరుసు "చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటించింది. అలానే తెలుగులో కూడా ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది ఈమె. పెరుసు చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది నిహారిక. ఆ సినిమా చూసిన పూరీకి.. నిహారిక నటన నచ్చడంతో.. పిలిచి ఆడిషన్ చేయడం, ఓ పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనిపించడంతో.. ఆమెను ఓకే చేసినట్టు చెబుతున్నారు.
త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటిస్తారని అంటున్నారు. ఈ మూవీతో పూరీ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. కరెక్ట్ టైమ్ లో మంచి బ్రేక్ ఇచ్చే మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని.. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో ప్రకటిస్తామని ఆ పోస్టులో రాసుకొచ్చారు. పూరి జగన్నాథ్ గత చిత్రాలు ఘోర పరాజయం పాలయ్యాయి. అందుకే ఈ సినిమా కోసం కాస్త టైం తీసుకుని మరీ ఈ కథను రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ గత సినిమాలకు భిన్నంగా కొత్త జోనర్‌లో ఈ మూవీ ఉండబోతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications