సీక్రెట్‌గా అక్కడ పూజలు చేయించిన మెగా డాటర్..!
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.
అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.తెలుగులో మనోజ్ నటిస్తోన్న ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది.

ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.ఇటీవలే ఈ సినిమా గద్దర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన ప్రోడక్షన్‌లో తన తర్వాత సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమైంది. ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నిహారిక కొణిదెల తన నిర్మాణ సంస్థ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' కార్యాలయంలో చండీ హోమం నిర్వహించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె ఈ హోమం ఎందుకు చేసిందని చర్చించుకుంటున్నారు.తన నిర్మాణ సంస్థ మరింత బలోపేతం కావాలని, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సినిమాలు నిర్మించాలని కోరుతూ నిహారిక ఈ చండీ హోమాన్ని నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆమె వ్యాపార అభివృద్ధికి, ఆశించిన విజయాలు సాధించడానికి చేసిన పూజగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications