నాగచైతన్య-నీహారిక కాంబినేషన్ లో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్?
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా చేసేందుకు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేక నానావస్థలు పడుతోంది. ప్రస్తుతం భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. నిర్మాతగా సినిమాను రూపొందించబోతోంది. దీంతోనైనా తనకు అదృష్టం కలిసివస్తుందని నీహారిక భావిస్తోంది.
ఈ క్రమంలోనే రెచ్చిపోయి మరీ హాట్ హాట్ ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. నిహారిక - నాగచైతన్య కాంబోలో ఓ ఇండస్ట్రీ హిట్ సినిమా మిస్ అయిందనేది ఆ వార్త సారాంశం. అక్కినేని నట వారసుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. జోష్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు.

హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా నటించిన సినిమా 100% లవ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందనే విషయం మనకు తెలిసిందే. చైతన్యని సుకుమార్ డిఫరెంట్ యాంగిల్ లో ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలోహీరోయిన్ తమన్నా కంటే ముందే మెగా డాటర్ నిహారికను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయాలని సుకుమార్ భావించారు.
అయితే మెగా ఫ్యామిలీ అందుకు ఒప్పుకోలేదు. నిహారికకు హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఉన్నప్పటికీ దాన్ని కుటుంబ సభ్యుల ఎదుట ఎక్స్ ప్రెస్ చేయలేకపోయింది. దీంతో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారు. ఆ సినిమాలో నిహారిక నటిస్తే ఆమె కెరీర్ మరో విధంగా ఉండేదని మెగా అభిమానులు భావిస్తున్నారు












Click it and Unblock the Notifications