మా నాన్న చెప్పేది అంతా సోది, సుత్తి.. నాగబాబుపై నిహారిక షాకింగ్ కామెంట్స్
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.
అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది.

ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నిర్మాతగా కూడా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిహారిక. ఇటీవలే సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయించారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నిహారిక సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన నిహారిక తన తండ్రి నాగబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
మీ ఫ్యామిలీలో అందరూ మీ తండ్రి, బాబాయ్ కి సపోర్ట్ చెయ్యాలేదనే డిస్పాయింట్మెంట్ ఉందా.. మీ నాన్నగారు అల్లు అర్జున్ పై కోపంగా ఉన్నారా ప్రశ్నించగా.. దానికి నిహారిక.. మా నాన్న చాలా యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ లో ఏవో పోస్ట్ లు చేస్తూ ఉంటారు. ట్విట్టర్ మాత్రమే కాదు మా నాన్న వాట్స్ ఆప్ చూసినా రోజు ఏదో సోది, సుత్తి పెడుతూ ఉంటారు. ఇదిలా అదిలా అంటూ, ఆ టాపిక్ గురించి ఇంట్లో ఎప్పుడు డిస్కర్షన్ జరగలేదని నిహారిక చాలా తేలిగ్గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications