అతడితో ఎంజాయ్ చేస్తోన్న మెగా డాటర్.. వర్షంలో ఫుల్ చిల్ మూడ్‌లో
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చారు.
విడాకుల అనంతరం కొంతకాలం సెలైంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తిరిగి టీవీ షోలు చేస్తోన్న నిహారిక, మంచు హీరో పక్కన హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇదే సమయంలో నిహారిక నిర్మాతగా కూడా మారి ఓ సినిమాను నిర్మించారు. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక తాజాగా తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.
తన పెట్ డాగ్‌తో ఎంజాయ్ చేస్తోన్న మూమెంట్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో..ఆమె కుక్కతో మాట్లాడుతున్నట్లు, దాని తలను నిమురుతున్నట్లు, దాన్ని ప్యాంపర్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 'వీటికి క్యాప్షన్ అవసరం లేదు... ఇద్దరు నేచురల్ లవర్స్' అనే క్యాప్షన్ తో షేర్ చేసింది. ఈ పోస్ట్ అందరి మనసులను గెలుచుకుంది. ఈ ప్రేమ బంధం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.












Click it and Unblock the Notifications