బీఫ్ తినే రణబీర్ రాముడేంది?: ప్రముఖ నటి సెన్సేషనల్ కామెంట్స్!

బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రామాయణ' సినిమా విడుదలకు ముందే పలు వివాదాలకు వేదికగా మారుతోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించడంపై తాజాగా నటి నికితా రావల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రణబీర్ చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. అతను వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నికితా రావల్ డిమాండ్ చేశారు.

20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!

నికితా రావల్ ఏం చెప్పిందంటే?
ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. శ్రీరాముడి పాత్రకు రణబీర్ కపూర్‌ను ఎంపిక చేయడంపై నికితా రావల్ ప్రశ్నించారు. తెరపై శ్రీరాముడిని చిత్రీకరించడం కేవలం నటన మాత్రమే కాదని.. అది ఓ పెద్ద బాధ్యత అని ఆ నటి పేర్కొన్నారు. శ్రీరాముడు కేవలం ఓ పౌరాణిక పాత్ర మాత్రమే కాదని.. లక్షలాది మంది ప్రజల విశ్వాసాలకు, విలువలకు ప్రతీక అని నికితా రావల్ భావిస్తున్నారు. అందువల్ల అటువంటి పాత్రలకు ఎంపికయ్యే నటులు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

Nikita Rawal Demands Apology from Ranbir Kapoor Over Ramayana Role and Beef Remark Full Details

గతంలో తాను బీఫ్ తింటానని రణబీర్ కపూర్ కొన్ని సంవత్సరాల క్రితం చేసిన ప్రకటనను నికితా రావల్ ప్రస్తావించారు. అలాంటి కామెంట్స్ చేసిన వ్యక్తి ఇప్పుడు శ్రీరాముడి పాత్రలో నటించడం సరికాదని.. అది సనాతన ధర్మాన్ని పాటించే ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న నటుడు ఆ పాత్రను స్వీకరించే ముందు, గతంలో చేసిన ఇలాంటి ప్రకటనలపై బహిరంగంగా స్పష్టత ఇవ్వాలని నికితా అన్నారు. బహిరంగ వివరణ ప్రకటన జారీ చేయాలని ఆమె రణబీర్ కపూర్‌ను కోరారు.

'రామాయణ' ట్రైలర్‌ సంచలన రికార్డ్.. 800 మిలియన్ వ్యూస్ తో వరల్డ్ టాప్ 3 రేసులో..!
'రామాయణ' ట్రైలర్‌ సంచలన రికార్డ్.. 800 మిలియన్ వ్యూస్ తో వరల్డ్ టాప్ 3 రేసులో..!

రణబీర్ కపూర్ తన కామెంట్లకు పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పేవరకు ఆయనకు వ్యతిరేకంగా #boycottranbirkapoor అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం కొనసాగిస్తానని నికితా రావల్ ప్రకటించారు. "ఈ పాత్ర చేయడానికి ముందు గానీ, తర్వాత గానీ తాను పొరపాటు చేశానని లేదా ఎవరినైనా బాధపెట్టానని ఆయనకు కొద్దిగా అనిపించినా క్షమాపణ చెప్పి, 'అవును, నేను తప్పు చేశాను' అని ఒప్పుకోవాలి. మనం క్షమించే వాళ్ళం... భారతదేశం క్షమించే గుణం ఉన్న ప్రజల దేశం." అని నికితా రావల్ పేర్కొన్నారు.

నటి నికితా రావల్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. సినిమా సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, సాంస్కృతికంగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులకు భావోద్వేగ అనుబంధాలు ఉంటాయని చిత్రనిర్మాతలు, నటీనటులు అర్థం చేసుకోవాలని ఆ నటి అంటోంది. రణబీర్ కపూర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా నికితా డిమాండ్ చేసింది. దీనివల్ల రణబీర్ గత కామెంట్లతో బాధపడిన వారి ఆందోళనలు తగ్గుతాయని నికితా రావల్ పేర్కొంది. రణబీర్ క్షమాపణ చెప్పేంత వరకు తాను అతనికి వ్యతిరేకంగా #BoycottRanbirKapoor ప్రచారాన్ని కొనసాగిస్తానని ఆ నటి పేర్కొంది. అయితే నికితా ప్రకటనపై రణబీర్ నుంచి గానీ, నిర్మాతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+