టాప్ దర్శకులతో సినిమాలు చేసినా స్టార్ హీరో కాలేకపోయాడు
కెరీర్ ప్రారంభంలో ఏ హీరో అయిన టాప్ దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటారు. దర్శకులు కూడా మంచి హీరోలతో సినిమాలు చేస్తే తమ రేంజ్ పెరుగుతుందని ఆశపడుతుంటారు. అలా టాప్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికి సక్సెస్ కాలేకపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అతి కచ్చింతంగా నితిన్. కెరీర్ ప్రారంభం నుంచి టాప్ దర్శకులతో సినిమాలు చేశారాయన. తన మొదటి సినిమా జయం. ఆ సినిమాకు దర్శకుడు తేజ. అప్పట్లో ఆయన టాప్ దర్శకుడే.
ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు, ఎన్టీఆర్‌కు ఆది వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడుతో నితిన్ దిల్ సినిమా చేశాడు. దర్శకధీరుడు రాజమౌళితో సై, కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం, పూరీ జగన్నాధ్‌తో హార్ట్ ఎటాక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అఆ. ఇలా తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికి నితిన్ కెరీర్ ముందుకు సాగడం లేదు.నితిన్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉందనే చెప్పాలి. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్.

జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది. నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. భీష్మ తర్వాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ చివరి సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి.
ఇదే సమయంలో కొందరు నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నితిన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు ప్రస్తుతం ''తమ్ముడు'' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటుగా వెంకి కుడుముల దర్శకత్వంలో వస్తున్న ''రాబిన్ హుడ్'' అనే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలైనా నితిన్ కెరీర్‌కు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి.












Click it and Unblock the Notifications