పీరియడ్స్ అని చెప్పినా వినిపించుకోలేదు..నిత్యా మీనన్ సంచలన కామెంట్స్
మలయాళ కుట్టి నిత్యా మీనన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ''అలా మొదలైంది'' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిత్యా మీనన్, తెలుగుతో పాటు, తమిళంలో కూడా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ధనుష్ హీరోగా నటించిన ''తిరు'' సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో నటనగాను నిత్యా మీనన్ జాతీయ అవార్డు గెలుకున్నారు.
కథ నచ్చితే కానీ నిత్యా మీనన్ సినిమాను ఓకే చేయరు. కథలో తనకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా నిత్యా మీనన్ ఓ ఇంటర్య్వూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. షూటింగ్ సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్న సమస్యలు గురించి నిత్యా మీనన్ ఈ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. తాను స్వయంగా ఇబ్బంది పడిన సందర్భాన్ని నిత్యా మీనన్ బయటపెట్టారు. కొంతమంది నిర్మాతలు, దర్శకులు అనారోగ్యంతో ఉన్నా, పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని ఈ సందర్భంగా నిత్యా మీనన్ వెల్లడించింది.

పీరియడ్స్ ఇబ్బంది పడుతున్నామని చెప్పినా వినిపించుకోరని తెలిపింది. ఆరోగ్యం బాలేకపోయినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు కోరతారని, ఇండస్ట్రీలో మహిళలు ఇలా అలవాటు పడ్డారని నిత్యా మీనన్ పేర్కొంది.అయితే దర్శకుడు మిస్కిన్‌ను ఇందులోంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పానని, దానిపై దర్శకుడు మిస్కిన్ సానుకూలంగానే స్పందించారని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications