PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం రికార్డ్.. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.3,500

దేశీయ ఇంధన రంగంలో సరికొత్త విప్లవం దూసుకొస్తోంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన' పథకం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ప్రారంభించిన అత్యల్ప కాలంలోనే ఏకంగా 50 లక్షల కంటే ఎక్కువ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల అమరికను పూర్తి చేసి, సరికొత్త మైలురాయిని దాటినట్లు కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆరేడు రోజుల్లోనే లక్ష ఇళ్లకు సోలార్ పవర్!

సుమారు రూ.75,021 కోట్ల భారీ బడ్జెట్‌తో అమల్లోకి వచ్చిన ఈ పథకం ప్రగతి ప్రస్తుతం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కేవలం 7.94 లక్షల ఇళ్లపై మాత్రమే సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు కాగా.. ఈ పథకం పుణ్యమా అని ఆ సంఖ్య ఇప్పుడు 50.06 లక్షలకు చేరింది. ప్రతి ఆరు రోజులకు కనీసం లక్ష కుటుంబాలకు కొత్తగా సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. గడిచిన జూలై నెలలోనే ఏకంగా 5.06 లక్షల ఇళ్లకు సోలార్ వ్యవస్థలను అమర్చి, ఒకే నెలలో అత్యధిక విక్రయాల రికార్డును నెలకొల్పారు.

PM Surya Ghar Rooftop Solar Scheme Milestone Over 50 Lakh Households Get Free Electricity Benefits
స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు..
స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు..

సున్నా కరెంట్ బిల్లులు.. పైగా విక్రయించి ఆదాయం!

ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.28,024 కోట్ల సబ్సిడీ సొమ్ము 'డీబీటీ' (DBT) రూపంలో జమ కావడం విశేషం. దీనివల్ల ప్రస్తుతం దేశంలో దాదాపు 19 లక్షల కుటుంబాలకు అసలు కరెంట్ బిల్లులు రావడం లేదు. ఉచిత కరెంట్ పొందడమే కాకుండా, తమ ఇంట్లో తయారైన అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి దాదాపు 12 లక్షల ఇళ్ల యజమానులు ఏకంగా రూ.421 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు. అంటే సగటున ప్రతి కుటుంబం ఏడాదికి రూ.3,500 వరకు అదనంగా ఆర్జిస్తోంది.

APCPDCL: కొత్త విద్యుత్ కనెక్షన్లపై గుడ్ న్యూస్ -ఇక ఐవీఆర్ఎస్ తోనే..!
APCPDCL: కొత్త విద్యుత్ కనెక్షన్లపై గుడ్ న్యూస్ -ఇక ఐవీఆర్ఎస్ తోనే..!

పేదరికం దాటి సూర్యకాంతి.. అంతా డిజిటల్ మయం!

పేద, ప్రాధాన్యత వర్గాల ఇళ్లకు కూడా ఈ పథకాన్ని విస్తరించడం విశేషం. పీఎంఎవై (PMAY), బీపీఎల్, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దాదాపు 1.6 లక్షల ఇళ్లపై ప్రత్యేక నమూనాలో సోలార్ ప్యానెళ్లు అమర్చారు. కేవలం 5.75 శాతం తక్కువ వడ్డీకే దాదాపు 21.87 లక్షల మందికి రుణాలు మంజూరు చేశారు. దరఖాస్తు నుంచి రుణాలు, నెట్ మీటరింగ్, సబ్సిడీ జమ వరకు మొత్తం ప్రక్రియను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా 100 శాతం డిజిటల్ విధానంలోకి తెచ్చారు. అంతేకాకుండా లక్షకు పైగా ప్రభుత్వ భవనాలపై కూడా సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, దేశాన్ని హరిత ఇంధనం వైపు వేగంగా తీసుకెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+