అందుకే పెట్టాను..లిప్ లాక్‌పై నిత్య మీనన్ ఓపెన్ కామెంట్స్
మలయాళ కుట్టి నిత్యా మీనన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ''అలా మొదలైంది'' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిత్యా మీనన్, తెలుగుతో పాటు, తమిళంలో కూడా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ధనుష్ హీరోగా నటించిన ''తిరు'' సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు.
ఈ సినిమాలో నటనగాను నిత్యా మీనన్ జాతీయ అవార్డు గెలుకున్నారు. కథ నచ్చితే కానీ నిత్యా మీనన్ సినిమాను ఓకే చేయరు. కథలో తనకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు. రొమాంటిక్ సీన్లకు, లిప్ లాక్ సన్నివేశాలకు నిత్యా మీనన్ దూరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అలాంటి నిత్యా మీనన్ ఓ సినిమాలో ఏకంగా లిప్ లాక్ చేసింది. అది కూడా ఓ అమ్మాయితో. "బ్రీత్: ఇంటు ది షాడోస్" అనే వెబ్ సిరీస్‌లో ఈ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్, అమిత్ సాధ్ మరియు నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ వెబ్ సిరీస్‌లో నిత్యా మీనన్, శ్రుతి బాప్నా మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంది.ఈ సన్నివేశం విడుదలైన తరువాత పెద్ద చర్చనీయాంశమైంది.ఈ సన్నివేశం గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ, ఈ సన్నివేశం సినిమాలోని కథకి చాలా ముఖ్యమని తెలిపారు.ఈ సన్నివేశం వివాదాస్పదంగా మారుతుందని తనకు ముందుగానే తెలుసని ఆమె అన్నారు.స్క్రిప్ట్‌లో అలాంటి సన్నివేశం అవసరమైతే, భవిష్యత్ సినిమాల్లో కూడా చేయడానికి నేను వెనుకాడనని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.












Click it and Unblock the Notifications