హత్య కేసులో నటి, పోలీసు కస్టడీలో ఎలా మేకప్ వేసుకుంది ?, చిక్కుల్లో లేడీ ఎస్ఐ, నోటీసులు
బెంగళూరులో చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్యకు గురి కావడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఓ మహిళా పోలీసు అధికారికి సమస్య ఎదురైంది. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఏ1 ఆరోపి నటి పవిత్ర గౌడ మేకప్ చేసుకోవడానికి అనుమతించిన మహిళా ఎస్‌ఐ నేత్రావతికి ఇప్పుడు పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడకు మేకప్ కిట్ ఇవ్వడానికి అనుమతించిన పోలీసు అధికారి నేత్రావతి (ఎస్ఐ) విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.పోలీసుల అదుపులో ఉండగా కన్నడ నటి, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ మేకప్ వేసుకుంది. నటి పవిత్ర గౌడ మేకప్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదని వెలుగు చూసింది.

దీనికి తోడు రాజరాజేశ్వరి నగర్ లోని ఇంటికి నటి పవిత్ర గౌడను పిలుచుకుని వెళ్లి కేసు విచారణ చేస్తున్న సమయంలో ఆ నటి పెదవులకు లిప్ స్టిక్ వేసుకుని, ముఖానికి మేకప్ వేసుకుందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో నటి పవిత్ర గౌడ ముఖానికి మేకప్ వేసుకుని ఆమె ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన వీడియో మీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది.
దీంతో పాటు పోలీసులపైనా విమర్శలు వచ్చాయి.విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెంగళూరు సిటీలోని విజయనగరం పోలీస్‌స్టేషన్ లేడీ ఎస్‌ఐ నేత్రావతికి డీసీపీ రూల్ 7 కింద నోటీసులు జారీ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ అరెస్టు అయ్యింది. పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడను జూన్ 15వ తేదీన ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లారు. ఆ సమయంలో నటి పవిత్ర గౌడను ఆమె ఇంటికి ఎస్ఐ నేత్రావతిని తీసుకెళ్లారు.

పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ ఆమె ఇంటికి వెళ్లే సమయంలో ఎప్పటిలాగే వెళ్లిందని, తరువాత పవిత్ర గౌడ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ముఖానికి ఫుల్ మేకప్ వేసుకుని, పెదవులకు లిఫ్ స్టిక్ వేసుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో పవిత్ర గౌడను మేకప్ వేసుకోవడానికి అనుమతించడంతో లేడీ ఎస్ఐ నేత్రావతి చిక్కుల్లో పడింది. కంఫర్ట్ సెంటర్‌కి తీసుకెళ్లినప్పుడు నటి పవిత్ర గౌడ దగ్గర మేకప్ కిట్ ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications