NTRxAnilRavipudi: ఎన్టీఆర్- అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్.. 2028 సంక్రాంతికి రికార్డులు బద్దలే..!
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్- అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రావడం ఇదే తొలిసారి. దాంతో ఈ క్రేజీ కాంబోపై సినీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను కన్ఫార్మ్ చేస్తూ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది కచ్చితంగా ఓ ఫన్ రైడ్ లా ఉండబోతుంది.. అని తెలిపారు ఎన్టీఆర్. అంతేకాక ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నట్లు కూడా హింట్ ఇచ్చారు. అటు ఇదే విషయంపై అనిల్ రావిపూడి కూడా ట్వీట్ పెట్టారు. మనిద్దరి కాంబినేషన్ ఎప్పటినుంచో రెడీ గా ఉంది. ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ మెంట్ కమింగ్ అప్ అని పోస్టు చేశారు.

ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్, దేవర, వార్ 2 లాంటి భారీ మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక డ్రాగన్ మూవీ తర్వాత ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి సినిమా రానున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు 2028 సంక్రాంతి కానుకగా ఈ మూవీని తీసుకురావాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
This one's going to be a laugh riot… @AnilRavipudi#NTRxAnilRavipudi@NANDAMURIKALYAN @NTRArtsOfficial https://t.co/jUMssuUrtU
— Jr NTR (@tarak9999) November 14, 2026
మరోవైపు టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గతేడాది విక్టరీ వెంకటేశ్ తో సంక్రాంతికి వస్తున్నాం మూవీ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి వెంకటేశ్- కల్యాణ్ రామ్ కాంబోలో జనవరి 12 విడుదల అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications
