మందు, సిగిరెట్స్‌తో చిల్ అవుతున్న ఎన్టీఆర్, నీల్.. ఫోటో లీక్ !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 'వార్ 2' సినిమాతో రాబోతున్నారు. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా.. కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. త్వరలోనే వార్ 2 మేకర్స్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ నుంచి ఎన్టీఆర్ పిక్స్ లీక్ అయ్యి వైరల్ గా మారాయి.
ఇక మరోవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా.. గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. దీంతో ఈ సినిమా కూడా కేజీఎఫ్, సలార్ సినిమాల కంటే కూడా భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా నీల్ సినిమాలకు సంబంధించి లీక్స్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటో ట్రెండింగ్ గా మారింది. ఆ ఫోటోలో నీల్, ఎన్టీఆర్ కలిసి ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నారు. అయితే అఆ ఫోటోను ఇంకొంచెం తీక్షణంగా పరిశీలిస్తే.. వారి మధ్యలో మద్యం పోసి ఉన్న గ్లాస్, సిగిరెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. దీంతో మంచిగా చిల్ అవుతున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆ పోస్టుకు స్కేరీ అనే కొటేషన్ రాసుకొచ్చింది లిఖితా రెడ్డి. ఎన్టీఆర్ - నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అతి త్వరలోనే సలార్ 2 సినిమా బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నట్టు కూడా అనుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న సలార్ 2 సినిమా సైతం రానుంది.












Click it and Unblock the Notifications