తుస్సుమనిపించిన ఎన్టీఆర్ ''దేవర''
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.ప్యాన్ ఇండియా మూవీగా 'దేవర'తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద షూటింగ్ జరుపుకుంటోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..అనిరుథ్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారని..ఆయన గత సినిమాల పాటలను ముఖ్యంగా రజినీకాంత్ హుకుం సాంగ్‌ను ఎన్టీఆర్ దేవర టైటిల్ సాంగ్ బిట్ చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే దేవర టైటిల్ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సాంగ్ సోసోగా ఉందని చెప్పేశారు.
ఇక యూట్యూబ్‌లో కూడా ఈ సాంగ్ తేలిపోయింది. విడుదలైన రోజు ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర టైటిల్ సాంగ్ రికార్టులను చేరుకోలేకపోయింది. దేవర ఫియర్ సాంగ్ 24 గంటల్లో కేవలం 5.19 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం చేసుకుంది. తారక్ కెరియర్ లోనే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ లో ఒకటిగా ఇది నిలిచింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం టాప్ 10లో కూడా ఈ పాటకి స్థానం లభించలేదు. టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ జాబితాలో చూసుకుంటే టాప్ 4 పాటలు మహేష్ బాబు సినిమాలలోనివే కావడం విశేషం. 17.42 మిలియన్ వ్యూస్ తో గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా సాంగ్ టాప్ 1లో ఉంది.

16.38 మిళియన్స్ వ్యూస్ తో సర్కారువారిపాట పెన్నీ సాంగ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే సినిమాలో కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ తో టాప్ 3లో ఉంది. సర్కారువారిపాటలోనే మమ మహేశా సాంగ్ 13.56 మిలియన్ వ్యూస్ తో టాప్ 4గా నిలిచింది. నెక్స్ట్ పుష్పలోని ఊ అంటావా సాంగ్ 12.39 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.పుష్ప 2 లోని టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏకంగా 10.38 మిలియన్ వ్యూస్ తో టాప్ 6లోకి వచ్చింది. భీమ్లా నాయక్ మూవీలో లాలా భీమ్లా సాంగ్ 10.20 మిలియన్ వ్యూస్ తో టాప్ 7గా ఉంది. ఆచార్య సానా కష్టం సాంగ్ 10.16 మిలియన్ వ్యూస్ తో టాప్ 8లో ఉండగా, మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి 9.52 మిలియన్ వ్యూస్ తో టాప్ 9లో ఉంది.
వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ 9.51 మిలియన్ వ్యూస్ తో టాప్ 10 లో నిలిచింది. కానీ దేవర సాంగ్ మాత్రం 5.19 మిలియన్ వ్యూవ్స్ మాత్రమే అందుకుంది. దీంతో దేవర టైటిల్ సాంగ్ ఫెయిల్ అయిందనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతోంది. దేవర సినిమాను దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్-2 సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. వార్-2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపికైయ్యారని గుస గుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications