'దేవర' విధ్వంసం..ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డ్
ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింగిల్ హీరోగా కనిపించడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలోని మొదటి పార్ట్ గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు డివైట్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్ దిశగా 'దేవర' దూసుకుపోయింది. దసరా సెలవులు 'దేవర'కు కలిసి వచ్చాయనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' భారీ వసూళ్లను సాధిస్తోంది. సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్‌గా రూ. 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.
మూడు రోజులు కలిపి ఈ సినిమా రూ.304 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించింది. ఎన్టీఆర్ సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'దేవర' నిలవడంతో పాటు, ఓవర్సీస్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్ సత్తా ఏంటో నిరూపించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 6 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. మొదటి వారంలో దక్కిన వసూళ్లతో పోల్చితే రెండో వారంలో వసూళ్లు డ్రాప్ అయినప్పటికీ, ఫ్యామిలీ ఆడియోన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టండంతో ఈమేర కలెక్షన్లు రాబట్టింది.

దేవర మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో, రెండో పార్ట్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల దర్శకత్వం వహించిన సినిమా ఇదే. విపరీతమైన నెగిటివిటీని తట్టుకుని మరి ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. రెగ్యులర్ ఆడియోన్స్, ఫ్యామిలీ ఆడియోన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, దసరా సెలవులు ఉండటంతో 'దేవర' ఈజీగా రూ. 800 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రెడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు.












Click it and Unblock the Notifications