సారీ ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నా - ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. మాస్ డైలాగులు చెప్పడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇక డ్యాన్స్‌ల్లో కూడా ఎన్టీఆర్ అదరగోడుతుంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్‌ను సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవలే ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి కామెంట్స్ చేశారు. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పడం జరిగింది. ''ఆర్ఆర్ఆర్'' సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన 'దేవర' చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన సత్తాను చాటారు. మొదట్లో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది దేవర. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినాను మరోసారి నిరూపించింది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ ఓ దర్శకుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోయారట. అవును మీరు వింటుంది నిజమే. ఎన్టీఆర్ ఓ దర్శకుడుపై కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోతానని బెదరించారట. ఎన్టీఆర్‌కు కోపం తెచ్చించిన దర్శకుడు మరెవ్వరో కాదు గుణ శేఖర్. ఎన్టీఆర్ చిన్నతనంలో బాలరామాయణం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడుగా నటించారు.

సినిమా షూటింగ్ మధ్యలో ఎన్టీఆర్ తెగ అల్లరి చేసేవారట. తోటి పిల్లలతో కలిసి షూటింగ్ కోసం తెచ్చిన వస్తువులన్నీ కూడా పాడు చేసేవారట. దీంతో కోపం వచ్చిన గుణ శేఖర్ ఎన్టీఆర్‌పై కోపంగా అరిచేశారట. దీంతో అలిగిన ఎన్టీఆర్ తాను ఈ సినిమా చేయనని చెప్పి అలిగి వెళ్లిపోయారట. వెంటనే ఎన్టీఆర్‌ను బుజ్జగించి తిరిగి సినిమాను కొనసాగించారట గుణ శేఖర్. బాక్సాఫీస్ వద్ద బాలరామాయణం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా ఎన్టీఆర్ చిన్నతనంలో బాగా అల్లరి చేసేవారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications