ఎన్టీఆర్ "గాడ్ ఆఫ్ వార్" ఆగమనం.. కుమారస్వామిగా ఎన్టీఆర్ విధ్వంసం

ఎన్టీఆర్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. మాన్ ఆఫ్ మాసెస్ గా ఫ్యాన్స్ ఆయన్ను ప్రేమగా పిలుచుకుంటారు. స్టూడెంట్ నెం. 1, ఆది, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ను కెరీర్ బిగినింగ్ లోనే అందుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రాఖీ, యమదొంగ, అదుర్స్ లాంటి చిత్రాలతో తన నటనతో మెప్పించారు. మధ్యలో కొన్ని ఫ్లాప్ లు వచ్చినా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ ఇలా వరుస హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించారు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళితో RRR చిత్రంతో ఎన్టీఆర్ స్టామినా ప్రపంచానికి తెలిసింది.

NTR Post on God of War with Trivikram Shakes Social Media Fans Go Crazy with Excitement NTR

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసింది. ప్రశాంత్ నీల్ సృష్టించిన డ్రగ్ మాఫియా సామ్రాజ్యం చూస్తుంటే ఈ సారి తెలుగు రాష్ట్రాలు, పాన్ ఇండియా కాదు ఏకంగా వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఈ మూవీ నుంచి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ను తారక్ కొద్దిసేపటి క్రితమే తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్, వన్స్ ఎగైన్ విత్ త్రివిక్రమ్ అంటూ పోస్టర్ ను వివరించారు ఎన్టీఆర్. పూర్తిగా యుద్ధ వాతావరణంలో త్రిశూలం, మురుగన్ స్వామి ఆయుధం కలగలిపి ఉన్న ఆయుధం పోస్టర్ లో కనిపిస్తుంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ పై ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+