Devara Pre Release Event : నా అభిమానులు ఎల్లప్పుడూ కాలర్ ఎగరేసేలా చూస్తా.. ఎన్టీఆర్ ఎమోషనల్, వీడియో రిలీజ్
Devara Pre Release Event cancellation: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. దేవర బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. మూవీ టీం సినిమా విడుదల కు ముందు చాలా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ లో వద్ద ఆదివారం సాయంత్రం మూవీ ప్రీ రిలీజ్ ప్లానే చేశారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అక్కడికి చేరుకున్నారు.
అయితే అనూహ్యంగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు. ప్రీ రిలీజ్ క్యాన్సల్ కావడంతో యంగ్ టైగర్ అభిమానాలు చాలా బాధపడ్డారు. దీంతో సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు." అభిమాన సోదరులకు నమస్కారం, దేవర ప్రీ రిలీజ్ వేడుక జరగకపోడం చాలా బాధకరం. ముఖ్యంగా నాకు చాలా బాధగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని ఉంటుంది. దేవర మూవీ గురించి.. ఈ సినిమా కోసం మేం పడిన కష్టాన్ని మీకు వివరిద్దామని అనుకున్నాను. కానీ భద్రత కారణాల వల్ల ఈవెంట్ రద్దు అయింది. మీ కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను" అని అన్నారు.

"ఇలా జరగడానికి నిర్మాతలది, నిర్వహకులది తప్పు కాదు. మీ అభిమానానికి ఆజన్మాంతం రుణ పడి ఉంటా. కానీ ఈ రోజు మనం కలవకపోయిన సెప్టెంబర్ 27న కలవబోతున్నాం. మీరు కలార్ ఎగెరేసి తిరిగేలా నేను చేస్తాను. ఆ సపోర్ట్ మాకు కావాలి. మీరు అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలి" అని ఎన్టీఆర్ వీడియోలో కోరారు. అస్సలు దేవర ప్రీ రిలీజ్ కు ముందు ఏం జరిగిందంటే.. భారీగా అభిమానులు రావడంతో వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. చాలా తక్కువ మందికి పాస్ లు ఇచ్చారు.
కానీ భారీ మొత్తంలో పాస్ లేని అభిమానులు కూడా వేదిక వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో వేదిక వద్దకు ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఏర్పడింది. అభిమానులు ఒక్కసారి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నంచడంతో నోవోటేల్ వద్ద అద్దం పగిలిపోయింది. దీంతో హోటల్ నిర్వాహకులు ప్రీ రిలీజ్ నిర్వాహకులతో మాట్లాడారు. ఇంత మంది వస్తే కంట్రోల్ చేయడం కష్టమని చెప్పినట్లు తెలుస్తోంది.
నేను చాలా బాధపడుతున్న.. అభిమాన సోదరులరా నన్ను క్షమించండి..!!#JrNTR #KoratalaSiva #JanhviKapoor #Oneindiatelugu#Devara #DevaraOnSep27th #DevaraPreReleaseEvent #DevaraCelebrations #DevaraJatharaaBegins pic.twitter.com/T3PfcAfpcS
— oneindiatelugu (@oneindiatelugu) September 22, 2024
మరోవైపు పోలీసులు కూడా షో రద్దు చేసుకుంటే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఏదైనా ఘటన జరిగితే బాధ పడాల్సి వస్తుందని భావించిన చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. సెప్టెంబర్ 27న దేవర ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications