పవన్ వల్ల కానిది ఎన్టీఆర్ చేసి చూపించాడు..!
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరో ఎవరంటే చెప్పడం కష్టమే. మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు ఎప్పటికప్పుడు తమ స్టామినాను నిరూపించుకుంటూనే వస్తున్నారు. ఈ స్టార్ హీరోల సినిమాలు హిట్ అయితే కలెక్షన్లు ప్రభంజనం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
అదేవిధంగా ఈ అగ్ర హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అదే రకంగా నష్టాలు కూడా వస్తుంటాయి. దీనికి చాలా సినిమాలే ఉదాహరణలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు బ్రహ్మోత్సవం వంటి సినిమాలు నిర్మాతలకు ఎంతటి నష్టాలను మిగిల్చిందో అందరికి తెలిసిన విషయమే.

పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు వచ్చిన నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లు సమయం పట్టిందని చిత్ర నిర్మాత నాగ వంశీ తాజాగా ఓ ఇంటర్య్వూలో తెలిపారు. త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో గతంలో సూపర్ హిట్లు రావడం.. వీరిద్దరి కలిసి మూడో సినిమా చేయడంతో 'అజ్ఞాతవాసి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాని అంచానాలను అందుకోవడంలో 'అజ్ఞాతవాసి' ఘెరంగా ఫెయిల్ అయింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతిపెద్ద డిజాస్టార్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాలను ఎన్టీఆర్ భర్తీ చేశాడని నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. త్రివిక్రమ్ ,ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. 'అరవింద సమేత' సినిమాతో వచ్చిన లాభాలతో 'అజ్ఞాతవాసి' నష్టాలను భర్తీ చేశామని నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చారు.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications