జైల్లో హీరో లగ్జరీ లైఫ్ కి చెక్ పెట్టిన అధికారులు, ఒంటరిగా మిగిలిపోయిన హీరోయిన్

కన్నడ చాలెంజింగ్ స్టార్, డిబాస్ దర్శన్ ను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య కర్ణాటకలోని బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. చిత్రదుర్గాకి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ తదితరులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో హీరో దర్శన్ కు రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో హీరో దర్శన్ కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆయన్ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే కేసులో అరెస్టు అయిన కన్నడ నటి పవిత్ర గౌడ మాత్రం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోనే ఉంటున్నది. ఇదే హత్య కేసులో మిగిలిన నిందితులు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి కర్ణాటకలోని వివిధ జైలుకు తరలించారు.

Officials have issued orders to be careful about hero darshan in Bellary

బళ్లారి సెంట్రల్ జైల్లో హీరో దర్శన్ కి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆయన్ను సాధారణ విచారణ ఖైదీ లాగానే చూడాలని జైళ్ల శాఖ అధికారులు బళ్లారి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. బళ్లారితో పాటు ఆ పరిసర జిల్లాల్లోని హీరో దర్శన్ అభిమానులు బళ్లారి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

హీరో దర్శన్ బళ్లారి సెంట్రల్ జైలుకు వెళ్లిపోవడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటి పవిత్రా గోడ ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. నటి పవిత్ర గౌడ కు కూడా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకుండా ఆమెను కూడా సాధారణ విచారణ ఖైదీ లాగానే చూడాలని సంబంధిత అధికారులు బెంగళూరులోని పరపర గ్రహాలు సెంట్రల్ జైలు సిబ్బందికి సూచించారని తెలిసింది.

ఇటీవల హీరో దర్శన్ బెంగళూరుకు చెందిన కొందరు రౌడీషీటర్లు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఆవరణలోనే దర్జాగా కుర్చుని కాఫీలు, సిగరెట్లు తాగుతున్న సమయంలో తీసిన ఫోటోలు బయటకు రావడం కలకలం రేపింది. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా చాలా సీరియస్ అయ్యాడు. కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ కూడా బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లి వివరాలు సేకరించారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అనుమతితో హీరో దర్శన్ ను బెంగళూరు సెంట్రల్ జైలు నుండి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+