'OG' మొదటి రోజు కలెక్షన్లు..ఆ హీరో రికార్డుకు దరిదాపుల్లో కూడా లేదుగా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పండుగలా విడుదలైన చిత్రం 'OG'. ఈ హై-యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజునే బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకు పరిచయమైన ఈ చిత్రం, విడుదల కాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.
పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపిస్తూ, 'OG' అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. ప్రముఖ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలో తొలి రోజున (పెయిడ్ ప్రివ్యూలతో సహా) ₹ 90.25 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

ఈ అద్భుతమైన వసూళ్లు, పవన్ కళ్యాణ్ మునుపటి చిత్రం 'హరి హర వీర మల్లు' మొదటి రోజు కలెక్షన్లను (₹ 34 కోట్ల నికర వసూళ్లు) అలవోకగా దాటిపోయింది. అంతేకాకుండా, ₹ 90 కోట్లకు పైగా ఓపెనింగ్‌తో, 'OG' 2025లో విడుదలైన కూలీ (₹ 65 కోట్లు), ఛవా (₹ 31 కోట్లు), సైయారా (₹ 21.5 కోట్లు) వంటి ఇతర పెద్ద చిత్రాల ఓపెనింగ్‌లను సైతం అధిగమించి, ఈ ఏడాది అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.
అయితే పవన్ కల్యాణ్ అభిమానులు ఆశించినట్టుగా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 రికార్డులను కొట్టలేకపోయింది. పుష్ప-2 సినిమా మొదటి రోజు రూ. 294 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ₹ 150 కోట్లు దాటే దిశగా..
విదేశీ మార్కెట్లలోనూ 'OG' హవా కొనసాగింది. ఉత్తర అమెరికాలో జరిగిన ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం ఏకంగా $3 మిలియన్లు (సుమారు ₹ 26 కోట్లు) వసూలు చేసింది. ఈ జోరు చూస్తుంటే, 'OG' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ₹ 150 కోట్ల స్థూల (Gross) వసూళ్లను దాటడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇది భారతీయ చలన చిత్ర చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించడం కూడా దాదాపు ఖాయం. ఆ జాబితాలో ఏ స్థానంలో నిలుస్తుందో శుక్రవారం నాటి తుది లెక్కలు తెలియజేయనున్నాయి.












Click it and Unblock the Notifications