ఆ ఒక్క మెసేజ్... జూనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని మార్చింది
ప్రతి కథానాయకుడికి తన కెరీర్ పరంగా కొంతకాలం బ్యాడ్ టైమ్ కూడా నడుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం శక్తి సినిమా నుంచి రభస సినిమా వరకు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డారు. బాద్ షా సినిమా హిట్టైనప్పటికీ కెరీర్ కు ఉపయోగపడలేదు. వరుసగా హిట్ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాడని విమర్శలు కూడా వచ్చాయి.
కాలర్ ఎగరేసుకునే మెసేజ్: టెంపర్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలలో నటిస్తానని మాటిచ్చిన తారక్ ఆ మాటను నిలబెట్టుకున్నారు. టెంపర్ సినిమా విడుదల రోజు తారక్ పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. ప్రీమియర్ షోలు పూర్తయినప్పటికీ తనకు కాల్స్ కానీ, మెసేజెస్ కానీ రాకపోవడంతో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడు.

సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు కాలర్ ఎగరేసుకున్న ఫోటోను వాట్సాప్ లో పంపించాడు. ఆ ఒక్క మెసేజ్ ఎన్టీఆర్ కు కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా తర్వాత జూనియర్ తన కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు రేంజ్ ను పెంచాయి. జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.
అద్భుతమైన ప్లానింగ్: తారక్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ సినిమాలో జాన్వీ రోల్ నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజనిజాలు బయటకు రావడంలేదు. దేవర సినిమా సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో వేచిచూడాల్సి ఉంది. సినిమాల పరంగా జూనియర్ తన కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. వార్2 చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.












Click it and Unblock the Notifications