మహేష్‌బాబుతో ఒకలా.. అల్లు అర్జున్‌తో మరోలా: త్రివిక్రమ్ పక్షపాతం
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుల నటుడు. చాలావరకు ఆయనకు కథ చెప్పి ఒప్పించడం సాధ్యం కాదు. అన్నివిధాలా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్న తర్వాత కథ విని ఓకే చేస్తాడు. దర్శకులు కూడా తాము రాసుకునే ప్రతి కథకు హీరోగా మహేష్ బాబునే దృష్టిలో ఉంచుకొని రాసుకుంటారు. తన నటనతో అంతగా మెస్మరైజ్ చేయగలిగిన శక్తి తనకు ఉంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నత్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ ప్రారంభంలో మొదటి సినిమాగా 'నువ్వే నువ్వే' చేశారు. రెండో సినిమా 'అతడు'. ఆ సినిమాను పవన్ కల్యాణ్ తో చేయాలనుకున్నారుకానీ వీలుపడలేదు. డైలాగులు హీరోకు చాలా తక్కువగా ఉంటాయి. పార్థు పాత్రలో మహేష్ బాబు తన పాత్రకు ప్రాణం పోశాడు.
మహేష్ బాబు సినిమాపై నీకు శ్రద్ధ ఏది?
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రిన్స్ కు 5 సంవత్సరాలు పట్టింది. 'ఖలేజా' చేశారు. అట్టర్ ఫ్లాప్ అయింది. టీవీల్లో వస్తుంటే మాత్రం ప్రజలు అతుక్కుపోయి చూస్తుంటారు. చివరగా 13 సంవత్సరాల తర్వాత గుంటూరు కారం చేశారు. దీనిమీద 'ఖలేజా'నే వెయ్యిరెట్లు బాగుందంటూ కామెంట్లు వచ్చాయంటే ఈ సినిమాను ఎలా తీశారో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ తో కూడా త్రివిక్రమ్ మూడు సినిమాలు చేశారు. మహేష్ బాబుతో సినిమా తీసి ఫ్లాపైన తర్వాత కసికొద్దీ అనేక జాగ్రత్తలు తీసుకొని, స్క్రిప్ట్ ను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకొని, బాగుంది అనుకున్న తర్వాతే మొదలుపెట్టేవారు. కానీ అదే నిబద్ధత, అదే శ్రద్ధ మహేష్ బాబుతో సినిమా తీసే సమయంలో ఎందుకు పెట్టడంలేదని ప్రిన్స్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మహేష్ బాబుతో నువ్వు ప్రయోగం చేస్తావా?.. నీమీద నమ్మకంతో సినిమా చేస్తే ఫ్లాప్ ఇచ్చి తర్వాత సినిమా అల్లు అర్జున్ తో చేసుకొని అతనికి హిట్ ఇస్తావా? నీ మనస్తత్వం మార్చుకోవాలని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో చర్చ పెట్టి త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు.

అతనితో అయితే ఒకలా... ఇతనితో అయితే మరోలానా?
అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. గుంటూరు కారం సినిమా ఫ్లాపైంది కాబట్టి జాగ్రత్తగా అన్నిరకాలుగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకొని అతనికి మళ్లీ హిట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబుతో ఒకలా, అల్లు అర్జున్ తో మరోలా సినిమాలు తీసే నువ్వు, నీ పక్షపాతం సినీ పరిశ్రమకు పనికిరాదని, సినిమాలు తీయడ మానుకొని కథలు రాసుకోమంటూ సలహాలిస్తున్నారు. పూనమ్ కౌర్ విమర్శలకు ఇంతవరకు నువ్వు నోరు తెరిచి సమాధానం చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నావంటేనే నువ్వు చేసిన తప్పేంటో తెలుస్తోందని, మరోసారి నువ్వు పక్షపాత ధోరణి మానుకోవాలంటూ మహేష్ బాబు అభిమానులు మాటల మాంత్రికుడిపై ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications