చిరంజీవికి లవర్‌గా, భార్యగా, అక్కగా, అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతినాయకుడు, సహ నటుడు పాత్రల నుంచి సుప్రీం హీరోగా, ఆ తర్వాత మెగాస్టార్ గా అవతరించారు. కోట్లమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తన కెరీర్ లో 154 సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఆడిపాడారు. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం చిరంజీవి పక్కన విభిన్నమైన పాత్రలను పోషించింది. చిరంజీవికి ప్రేమికురాలిగా, భార్యగా, అక్కగా, తల్లిగా నటించి అన్ని పాత్రల్లో మెప్పించింది. ఆమె ఎవరో కాదు.. సీనియర్ నటి సుజాత.

ప్రేమ తరంగాలులో లవర్ గా
తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల్లో సుజాత మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈ మూడు పరిశ్రమల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ప్రేమ తరంగాలులో చిరంజీవికి సుజాత ప్రేమికురాలిగా నటించింది. సినిమా చివరలో ఇద్దరికీ వివాహం జరుగుతుంది. దీంతో చిరంజీవికి భార్యగా కూడా మెప్పించింది. ఈ సినిమా ఓ బాలీవుడ్ సినిమాకు రీమేక్ సినిమాగా తీశారు. ప్రేమ తరంగాలు సినిమా విడుదలైన రెండు సంవత్సరాలకు సీతాదేవి సినిమాలో చిరంజీవితో సుజాత మరోసారి నటించి మెప్పించింది. కాకపోతే చెల్లెలి పాత్రలో నటించింది.

only heroine played lover wife sister mother with mega star chiranjeevi

బిగ్ బాస్ లో తల్లిగా
ఈ సినిమాకు దర్శకురాలు కూడా ఆమే. ఆ తర్వాత 1995లో విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో రోజా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటివరకు చిరంజీవితో ఇలా ప్రేమికురాలిగా, భార్యగా, చెల్లిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ సుజాత కావడం విశేషం. 2011 ఏప్రిల్ ఆరోతేదీన కన్నుమూసిన సుజాత తెలుగు సినీ పరిశ్రమలోని అందరు హీరోలతోపాటు మరికొందరు హీరోలకు తల్లిపాత్రల్లో నటించారు. మంచి హావభావాలతో అద్భుతమైన నటిగా పేరుతెచ్చుకున్నారు. సుజాత ఖాతాలో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+