ఇండియాలో నెంబర్ వన్ హీరో అతడే..తేల్చేసిన సర్వే

భారతదేశ సినీ అభిమానుల నాడిని పట్టుకునే ప్రయత్నంలో, ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా క్రమం తప్పకుండా నిర్వహించే సర్వేలు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తాయి. తాజాగా విడుదలైన 'ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్: అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినీ తారలు' సర్వే, దేశవ్యాప్తంగా అగ్ర హీరోల స్థానాలను వెల్లడించింది.

ఈ సర్వే, ప్రాంతీయ సినీ పరిశ్రమలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తారల మధ్య పెరుగుతున్న పాన్-ఇండియా ప్రభావాన్ని స్పష్టం చేసింది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మాత్రమే దేశవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించేవారు. కానీ ఇప్పుడు, సౌత్ ఇండియా స్టార్స్ తమ నటనా ప్రతిభ, భారీ ప్రాజెక్టులతో హిందీ ప్రేక్షకులను కూడా అలరించి, జాబితాలో సగర్వంగా నిలిచారు.

Ormax Media survey on top 10 heroes in India

ప్రస్తుతం విడుదలైన జాబితాలో టాప్ హీరోలను పరిశీలిస్తే..బాలీవుడ్ కండల వీరుడు ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ 10వ స్థానంలో నిలిచారు.9వ స్థానంలో మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు.7వ స్థానంలో ఎన్టీఆర్, 6వ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. తమిళ స్టార్ హీరో అజిత్ ఈ సర్వేలో 5వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.పుష్ప-2తో ప్యాన్ ఇండియా రికార్డులను కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ ఈ జాబితాలో 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక మన డార్లింగ్ ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా నిలిచాడు.ఆర్మాక్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచాడు.ఇప్పటికే పలు సర్వేలు ఇండియాలో నెంబర్ వన్ హీరో ప్రభాస్ అని తేల్చేశాయి. తాజాగా ఆర్మాక్స్ మీడియా సైతం ప్రభాస్ ఇండియాలో నెంబర్ హీరో అని ప్రకటించింది.

ఈ సర్వే ఫలితాలు కేవలం హీరోల ప్రజాదరణను మాత్రమే కాకుండా, భారతీయ సినీ ప్రేక్షకుల అభిరుచులు ఎలా మారుతున్నాయో, పాన్-ఇండియా సినిమాల ప్రాముఖ్యత ఎంతగా పెరుగుతోందో తెలియజేస్తున్నాయి. ఇది భవిష్యత్తులో రాబోయే భారీ ప్రాజెక్టులకు, స్టార్ హీరోల కెరీర్‌కు ఒక దిశానిర్దేశంగా మారుతుందనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+