ఓటీటీలో 5 హాలీవుడ్ థ్రిల్లర్స్..ట్విస్టుల మీద ట్విస్టులు..అస్సలు వదలొద్దు!

బెస్ట్ సెల్లర్ పుస్తకాలు లేదా ప్రసిద్ధ నవలలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వస్తున్న ట్రెండ్. నవలల్లోని విజువల్ ఇమాజినేషన్, సంక్లిష్టమైన పాత్రలు స్క్రీన్ పైకి వచ్చినప్పుడు కలిగే అనుభూతే వేరు. అలాంటి కథలతో, ఊహించని ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్‌ను కట్టిపడేసే 5 సూపర్‌హిట్ సినిమాలు ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీకెండ్‌లో మిస్ కాకుండా చూడాల్సిన ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.

18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!
18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!

1. గాన్ గర్ల్ - సైకలాజికల్ థ్రిల్లర్

కథా మూలం: గిలియన్ ఫ్లిన్ రాసిన పాపులర్ థ్రిల్లర్ నవల
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.1/10
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

పెళ్లైన ఐదో వివాహ వార్షికోత్సవం రోజే భార్య హఠాత్తుగా మాయమవుతుంది. భార్య మిస్సింగ్ చుట్టూ తిరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో భర్తే ప్రధాన అనుమానితుడిగా మారతాడు. కానీ అసలు నిజం ఏంటి? ఆమె నిజంగానే కిడ్నాప్ అయిందా? లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అన్నది ఊహ కందని ట్విస్టులతో సాగుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ మాస్టర్‌పీస్.

బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్న ఓటీటీ సినిమా.. కలెక్షన్ల సునామీ!
బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్న ఓటీటీ సినిమా.. కలెక్షన్ల సునామీ!
OTT five Mind-Blowing Hollywood Thrillers That Will Keep You on the Edge of Your Seat

2. ద పేల్ బ్లూ ఐ - పీరియాడిక్ మర్డర్ మిస్టరీ

కథా మూలం: లూయిస్ బాయర్డ్ రాసిన చారిత్రక మిస్టరీ నవల
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

1830ల కాలంలో సాగే కథ ఇది. ఒక మిలిటరీ అకాడమీలో దారుణంగా జరిగిన హత్యను ఛేదించడానికి ఒక డిటెక్టివ్ రంగానికీ దిగుతాడు. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్‌లో అతనికి అదే అకాడమీకి చెందిన ఒక యువ క్యాడెట్ సాయం చేస్తాడు (ఆ క్యాడెట్ మరెవరో కాదు, తర్వాతి కాలంలో ప్రసిద్ధ రచయితగా మారిన ఎడ్గర్ అల్లన్ పో). కేసు ముందుకు సాగే కొద్దీ బయటపడే రహస్యాలు, చీకటి కోణాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి.

3. లీవ్ ద వరల్డ్ బిహైండ్ - మైండ్ గేమింగ్ సర్వైవల్ థ్రిల్లర్

కథా మూలం: రుమాన్ ఆలం రాసిన నవల
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.4/10
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

న్యూయార్క్ నగరానికి దూరంగా ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్‌ను అద్దెకు తీసుకుని సెలవులు గడపడానికి వెళ్తుంది ఒక కుటుంబం. కానీ సడన్‌గా ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఎటాక్ జరిగి కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం కుప్పకూలుతుంది. శాటిలైట్లు, ఇంటర్నెట్, ఫోన్లు పనిచేయకపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆ తర్వాత జరిగే వింత సంఘటనలు, ప్రాణాలు దక్కించుకోవడానికి ఆ కుటుంబం పడే ఆరాటం భయాన్ని, ఉత్కంఠను రేకెత్తిస్తాయి.

4. మోనికా, ఓ మై డార్లింగ్ - డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్

కథా మూలం: జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన 'బురుటాసు నో షింజో' నవల
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.4/10
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

రాజ్‌కుమార్ రావ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఒక రోబోటిక్స్ నిపుణుడు తన ఆఫీసులోని యువతితో ఎఫైర్ పెట్టుకుంటాడు. అయితే ఆమె అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టడంతో, ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఒక ప్లాన్ వేస్తాడు. కానీ అది కాస్తా ఊహించని మలుపులు తిరిగి అతని మెడకు చుట్టుకుంటుంది. క్రైమ్, కామెడీ, సస్పెన్స్ సమానంగా కుదిరిన చిత్రం ఇది.

5. గాడ్స్ క్రూకెడ్ లైన్స్ - మైండ్ బెండింగ్ సైకలాజికల్ మిస్టరీ

కథా మూలం: టోర్క్యూటో లూకా డి టెనా రాసిన స్పానిష్ నవల
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మానసిక చికిత్సాలయంలో కావాలనే పేషెంట్‌గా చేరుతుంది. అక్కడ అనుమానాస్పదంగా మరణించిన ఒక పేషెంట్ హత్య వెనుక నిజాలు కనిపెట్టడమే ఆమె లక్ష్యం. అయితే దర్యాప్తు సాగే కొద్దీ ఆమె చెప్పేవి నిజాలా లేక మానసిక భ్రమలా అనే సందేహం డాక్టర్లకు, ప్రేక్షకులకు కూడా వస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం అని చివరి నిమిషం వరకు గందరగోళానికి గురిచేస్తూ సాగే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+