ఈ సినిమా ఎలా హిట్ అయిందబ్బా..?
కొన్ని సినిమాల్లో కంటెంట్ బాగున్నా ప్రేక్షకులు తిరస్కరిస్తుంటారు. సినిమాలో చిన్న లోపం కనిపించినా దాన్ని పెద్ద తప్పుగా చూపిస్తూ ఆ సినిమాను ఫ్లాప్ చేస్తారు. అలాగే కొన్ని సినిమాలు ఏమాత్రం బాలేకపోయినా సూపర్ హిట్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి అయోమయంలోనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు , దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తుంటారు.మన వాళ్లకు భాషతో పనిలేదు. సినిమా బాగుంటే చాలు ,ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తారు.
దీనికి ఇటీవల విడుదలైన 'ఛావా' సినిమానే సాక్ష్యం. తొలుత ఈ సినిమాను హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు.ప్రేక్షకులు డిమాండ్ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను తెలుగులో డబ్ చేశారు. ఇక్కడ కూడా 'ఛావా' సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటి తెలుగు ప్రేక్షకులకు ఓ సినిమా గట్టి షాకే ఇచ్చింది. పరభాషలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ సినిమాను తెలుగు ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు దాని గురించి తెగ ప్రమోట్ చేశారు.

సూపర్ థ్రిల్లర్, ట్విస్టులతో కూడిన క్రైమ్ సినిమా అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. తీరా సినిమా చూసిన తర్వాత ఇదేం సినిమా, ఇది ఎలా సూపర్ హిట్ అయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు..మలయాళ సూపర్ హిట్ సినిమా 'రేఖాచిత్రం'. ఈ సినిమాలో అసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించారు. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా 'రేఖాచిత్రం' ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన రేంజ్‌లో లేదని తెలుగు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
40 ఏళ్ళ క్రితం జరిగిన యువతి హత్య కేసు చూట్టు కథ తిరుగుతోంది. కథ, కథనం రెండూ కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక క్రైమ్ థ్రిల్లర్ జోన్‌లో సాగే ఇన్వెస్టిగేషన్ కూడా పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించదు. మలయాళం సినిమాల్లో ఉండే సాగదీత ఈ సినిమాలో కూడా కనిపిస్తోంది. సినిమా స్లోగా ఉన్నా ఆసక్తికరంగా ఉందా అంటే అదీ లేదు. ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అక్కడ మాత్రం సూపర్ హిట్ అయింది. అసిఫ్ అలీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం 10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వద్ద 70 కోట్లు రాబట్టింది. జోఫీన్ టీ చాకో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications