సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఇవే!
ఓటీటీ ప్రియులకు పండగే పండగ! ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా నిశ్శబ్దంగా డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చి సర్‌ప్రైజ్ చేశాయి కొన్ని క్రేజీ సినిమాలు. థియేటర్లలో సందడి చేసిన టాలీవుడ్ వినోదం నుంచి బాలీవుడ్ మోస్ట్ డిమాండింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా వరకు... ఈ వారం ప్రైమ్ టైమ్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.
కామ్రేడ్ కళ్యాణ్‌తో శ్రీవిష్ణు నవ్వుల హంగామా
ఔట్ అండ్ ఔట్ కామెడీతో ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్వించిన యంగ్ హీరో శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. 1992 నేపథ్యంలో గ్రామీణ రాజకీయాలు, యాక్షన్, కామెడీల కలబోతగా వచ్చిన ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో మెరిసిన ఈ నవ్వుల పండగ ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో మిస్సయిన ఫన్ లవర్స్‌కు ఇది మంచి ఛాయిస్.

ఓటీటీలో రాజుకున్న 'మీర్జాపూర్' రచ్చ
క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారికి ఒక గుడ్ న్యూస్. డిజిటల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సూపర్‌హిట్ వెబ్‌సిరీస్ ఆధారంగా తెరకెక్కిన 'మీర్జాపూర్: ది మూవీ' ఓటీటీ లోకి అడుగుపెట్టింది. సెప్టెంబరులో బిగ్ స్క్రీన్ పై విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఎక్స్‌టెండెడ్ కట్‌తో 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవికిషన్ వంటి ఉద్దండుల నటన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ప్రత్యేక ఆకర్షణ.
త్వరలోనే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' కూడా..
ఈ సినిమాలతో పాటు మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటించిన క్రేజీ ఫాంటసీ కామెడీ డ్రామా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' కూడా డిజిటల్ ప్రిమియర్లకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' వేదికగా ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఈ వారాంతానికి డిజిటల్ స్క్రీన్లపై మంచి వినోదాన్ని ఆస్వాదించడానికి అందరూ సిద్ధమవ్వండి.














Click it and Unblock the Notifications
